సింగిల్ సినిమా తీయకముందే టాలీవుడ్ లో క్రేజ్ | One More Mallu Talent Ready to Launch in Tollywood

Mollywood debut actress craze in tollywood

Aishwarya Laxmi, Aishwarya Laxmi Tollywood, Aishwarya Laxmi New Movies, Aishwarya Laxmi Craze, Aishwarya Laxmi Debut, Aishwarya Laxmi Mollywood, Aishwarya Laxmi, Mallu Talent Tollywood, Malayalam Actress Aishwarya Laxmi

Tollywood Que for Mollywood Debut Actress Aishwarya Lakshmi. Premam Director Altaf launched her there. Kalyan Ram's Next after MLA and few more Tollywood Makers approached her.

మాలీవుడ్ టూ టాలీవుడ్.. మరో బ్యూటీ

Posted: 07/29/2017 10:43 AM IST
Mollywood debut actress craze in tollywood

టాలీవుడ్ లో తెలుగు వాళ్లకన్నా పరభాష హీరోయిన్ల హవా కొనసాగటాన్ని ఆపటం చాలా కష్టంగా కనిపిస్తోంది. బోల్డ్ నెస్ కమిట్ మెంట్లకు మనోళ్లు దూరంగా ఉండటమే అందుకు కారణం అవుతోంది. అయితే మన దగ్గర సందడి చేస్తున్న మళయాళపు హీరోయిన్ల దగ్గర మాంచి మ్యాటరే ఉంటోంది. స్కిన్ షోలకు కాస్త దూరంగానే ఉంటూ తమ యాక్టింగ్ టాలెంట్ తో మెప్పిస్తూ వస్తున్నారు. ఇక అక్కడ ఎవరైనా క్లిక్ అయితే చాలూ వెంటనే ఇక్కడా దించేసేందుకు మన డైరక్టర్లు రెడీగా ఉంటున్నారు.

నిత్యామీనన్, మాళవిక నాయర్, మాంజిమా, అనుపమ పరమేశ్వరన్, అనూ ఇమ్యానుయేల్, సాయిపల్లవి అలా అక్కడి నుంచి వచ్చి సక్సెస్ లు అందుకుంటున్న వారే. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో మలయాళీ భామ తెలుగు తెరపైకి వస్తోంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన ఐశ్వర్య లక్ష్మి మాలీవుడ్ లో డెబ్యూకి రెడీ అయిపోతుంది.

'ప్రేమమ్' చిత్రం ద్వారా అనుపమ, సాయి పల్లవికి క్రేజ్ తెచ్చిన దర్శకుడు ఆల్తాఫ్ కొత్త సినిమా తీయబోతున్నాడు. అందులో ఐశ్వర్య లక్ష్మిని హీరోయిన్ గా తీసుకున్నాడు. దీంతో మనోళ్ల కన్ను ఆ బ్యూటీ మీద పడిపోయింది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎంఎల్ఏ తర్వాత తీయబోయే సినిమా కోసం ఈ అమ్మాయిని తీసుకోబోతున్నాడని సమాచారం. అంతేకాదు మరో ఇద్దరు .. ముగ్గురు తెలుగు దర్శకులు ఈ అమ్మాయి కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malayalam Actress  Aishwarya Laxmi  Tollywood  

Other Articles