హెవీ యాక్షన్ టీజర్ .. ఏం అర్థం కాలేదుగా... | Vishal Thupparivaalan teaser only High Voltage action

Thupparivaalan teaser released

Vishal, Vishal New Movie, Vishal New Movie Teaser, Vishal Thupparivaalan, Thupparivaalan Teaser Review, Thupparivaalan Teaser, Thupparivaalan Movie, Kollywood New Teasers

Kollywood Hero Vishal's Thupparivaalan teaser out. Centers on finding clues, fighting and intense close-ups.

విశాల్ కొత్త టీజర్ వచ్చేసింది

Posted: 07/20/2017 03:00 PM IST
Thupparivaalan teaser released

కోలీవుడ్ హీరో విశాల్ ప్రయోగాత్మక చిత్రాలు చేసినప్పటికీ అవి ఎక్కువగా మాస్ పల్స్ ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంటాడు. అఫ్ కోర్స్ దానికి తగ్గట్లే ఆ ఫాలోయింగ్ కూడా ఉంటుందనుకోండి. అందుకే ఈసారి కూడా 'తుప్పరివాలన్' అనే సినిమాతో వాళ్ల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దాంతో తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

ఓ క్యాప్ తో డిఫరెంట్ వేషధారణతో విశాల్ ఇందులో కనిపించబోతున్నాడు. ఛేజింగ్ లు, చైనీస్, ఆఫ్రికన్లతో ఫైట్లు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా టీజర్ ను కట్ చేశారు. దీంతో ఏ జోనర్ సినిమానో అర్థం కాకుండా ఉంది. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం ఓ రేంజ్ లో వున్నాయనే విషయం స్పష్టమౌతోంది. టీజర్ తో అంచనాలు తప్పకుండా పెరుగుతాయనే చెప్పొచ్చు.

మిస్కిన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం విశాల్ ఓన్ బ్యానర్ పైనే తెరకెక్కుతోంది. పిశాచి ఫేమ్ అర్రోల్ కోరెల్లి సంగీతం అందిస్తున్నాడు. స్నేహ భర్త ప్రసన్న, నటుడు వినయ్ రాయ్, ఆండ్రియా .. అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో నటించబోతున్నారు. తెలుగులో కూడా మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలో టీజర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు విశాల్ వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Thupparivaalan  Kollywood News  

Other Articles