పవర్ పంచ్.. దోమలు పెంచుతుందని ఆర్జేకీ నోటీసులు.. దెనీకైనా రెడీ అంటోంది | RJ hits back at BMC over Pothole Parody

Bmc issues notice to popular radio jockey

RJ Malishka, Shiv Sena slams RJ, BMC Paraody Song, Brihanmumbai Municipal Corporation RJ, Radio Jockey Malishka Sena, Pothole Parody

BMC Targets RJ Malishka For Criticising The Corporation Over Potholes and serve notices. Malishka hits back at BMC, tweets she has six more songs ready.

వీడియో సాంగ్ పాడి బుక్కైన రేడియో జాకీ

Posted: 07/20/2017 02:10 PM IST
Bmc issues notice to popular radio jockey

వివాదాస్పద పాట పాడి ఓ రేడియో జాకీ వివాదంలో చిక్కుకుంది. ముంబై లో ఆర్జే అయిన మలిష్కా ఓ ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్ లో పని చేస్తోంది. ఈ మధ్య ముంబై కార్పొరేషన్ పని తీరును ఎండగడుతూ ఓ సాంగ్ ను పాడింది. దీంతో శివసేన కార్పొరేటర్ లో పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమైపోతున్నారు.

నిమిషంన్నర నిడివి ఉన్న ఆ వీడియోలో ప్రజలకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై ఎలాంటి భరోసా లేదంటూ చమత్కరిస్తూ, రోడ్ల వైఫల్యాలు, డ్రైనేజీ వ్యవస్థ ఇలా అన్నింటి గురించి ప్రస్తావించింది. దీంతో సేన కార్యకర్తలు 93.5 రెడ్ ఎఫ్‌ఎంపై, ఆర్జే మలిష్కాపై 500 కోట్ల పరువు నష్టం దావా వేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు సేన నేత సదా సర్వాంకర్ కొడుకు ముంబై కమిషనర్‌ అజయ్ గోలెను కలిసి ఫిర్యాదు చేశారు. ఆపై బీఎంసీ నుంచి ఇంట్లో ఆమె దోమలు పెంచుతుందంటూ నోటీసులు కూడా పంపింది.



అయితే తాను కేవలం శ్రోతలను ఉత్సాహపరచడం కోసం ఓ పాట పాడినట్లు మలిష్కా ముందు చెప్పినప్పటికీ తర్వాతి పరిణామాలతో మనసు మార్చుకుంది. న్యూయార్క్ లో ఉన్న ఈ వివాదాస్పద ఆర్జే తన పాటను రాజకీయం చేస్తారని ఊహించలేదని చెబుతో తానిప్పుడు రాపర్ అయ్యానని, మరో ఆరు పాటలను సిద్ధం చేసినట్లు ట్విట్టర్ లో ప్రకటించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RJ Malishka  Pothole Parody  BMC  Shiv Sena  

Other Articles