ఇంటరాగేషన్ పై పూరీ.. మీడియాపై ఓ రేంజ్ లో ఫైర్ | Puri Fire Media over Stories on Him in Drug Case

Puri emotional message after sit probe

Puri Jagannadh, Puri Jagannadh Fire on Media, Puri SIT Probe, Puri Tollywood Drug Case, Puri Jagannadh Message, Telugu Director Puri Jagannadh, Director Emotional Message

Director Puri Jagannadh Emotional Message in Facebook after SIT Probe. Expresses His Anger on News Channels For Highlighting Him.

పూరీ ఎమోషనల్ మెసేజ్.. మీడియాను ఏకేశాడు!

Posted: 07/20/2017 08:23 AM IST
Puri emotional message after sit probe

డ్రగ్స్ వ్యవహారంలో బుధవారం సిట్ విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను 10 గంటలకు పైగానే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. ముఖ్యంగా కెల్విన్ సంబంధాలపై ఫోటోలతోసహా ఎంక్వైరీ చేసినట్లు తెలుస్తోంది. పూరీ విచారణకు పూర్తిగా సహకరించాడని తర్వాత సిట్ అధికారులు మీడియాకు వెల్లడించారు కూడా. అయితే విచారణ అనంతరం పూరీ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయాడు. కానీ, ఇంటికెళ్లిన కాసేపటికే ఫేస్‌బుక్‌లో పూరీ పెట్టిన ఓ ఎమోషనల్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సిట్ విచారణ లో తాను విచారణ ఎదుర్కున్నానని చెబుతూ మీడియాపై ఫైరయ్యాడు. మీడియా తనకు ఎంతో గౌరవముందని, అందుకే ఇజం సినిమా తీశానని కూడా చెప్పాడు. అదే మీడియా ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేసిందన్నారు. వారికి తెలిసినా, తెలియకున్నా తప్పుడు కథనాలతో బ్రేకింగు న్యూస్ లు వేసిందన్నారు. ఇది తనను చాలా బాధకు, ఆవేదనకు గురిచేసిందని చెప్పుకొచ్చారు. సిట్ కార్యాలయానికి వెళ్లిన తాను వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పానన్నారు. మళ్లీ వారెప్పుడు పిలిచినా వెళ్తానని పేర్కొన్నారు. తాను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తినని, డ్రగ్సే కాదు.. అసాంఘిక కార్యక్రమాలకు ఎప్పుడూ పాల్పడలేదని, ఇకపైనా అటువంటి పనులు చేయబోనని పేర్కొన్నాడు.

తనకు కెల్విన్ ఎవరో తెలియలేదని, తనెప్పుడూ అతన్ని కలవలేదని అధికారులకు చెప్పానన్నాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే ఎంతో గౌరవం ఉంది కాబట్టే వాళ్ల మీదే ఎక్కువ సినిమాలు తీశానని తెలిపాడు.నాలుగు రోజుల నుంచి తన తల్లీ, భార్య, పిల్లలు ఏడుస్తున్నారన్నారు. మీడియా వ్యవహరించిన తీరు తన జీవితాన్ని నాశనం చేసిందని, చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. మీడియాలో అందరూ తన స్నేహితులేనని, వారందరూ తర్వాతైనా తనను కలుస్తారని చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే సిట్ తేలుస్తుందని, ఇప్పటికైనా అత్యుత్సాహం వద్దని హితవు పలికాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Puri  Drug Case  SIT Probe  

Other Articles