తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్దంపాటు హీరోయిన్ గా రాణించటం అంటే మాములు విషయం కాదు. ఇప్పుడున్న హీరోయిన్లకు అది కత్తిమీద సాము లాంటిదే. ఎప్పటికప్పుడు వచ్చే ఫ్రెష్ అందాల మధ్య పోటీ నెలకొనటమే ఇందుకు కారణం. అయితే 90వ దశకంలో ఇలాంటి సమస్య అంతగా ఉండేది కాదు. ప్రతీ హీరోయిన్ కు దాదాపుగా అందరు స్టార్ హీరోల పక్కన చేసే ఛాన్స్ దక్కేది. పైగా ఒక సినిమాలో ముగ్గురు, నలుగురు ఒకేసారి కలిసి చేసిన దాఖలాలు ఉన్నాయి.
అలాంటి హీరోయిన్లలో ఆమని కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకుంది. అఫైర్లు, రూమర్లను కూడా తాను చాలా లైట్ గా తీస్కునేదంట. అయితే తనని దారుణంగా బాధించిన విషయం మాత్రం ఒకటి ఉందని చెప్పింది ఆమని. అదే చిరంజీవితో ఛాన్స్ మిస్సయిన మూమెంట్ అంట. ఆ టైంలో తాను చాలా ఏడ్చేశానని ఈ సీనియర్ నటి అంటోంది.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి తాను ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందులో సౌందర్యతోపాటు తాను నటించాల్సి ఉంది. కానీ, అదే సమయానికి అమెరికాలో పరుచూరి బ్రదర్స్ వారి టూర్‌కి నేను ఒప్పుకున్నాను. అయితే చిరు సినిమా ఛాన్స్ కంటే తనకు ఏదీ ముఖ్యం కాదనుకుని ఆ ఈవెంట్ ను వదిలేశాను. తీరా వెళ్లి చూస్తే చిరంజీవి సినిమాలో నుంచి నన్ను తీసేశారని చెప్పారు. అటు టూరు, ఇటు మెగాస్టార్ పక్కన హీరోయిన్ అవకాశం కోల్పోవటంతో దిగాలుగా కూర్చుంటే ఇండస్ట్రీలో తనకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ సౌందర్యే వచ్చి ఓదార్చిందని ఆమని వివరించింది. అయితే తనకు అవకాశం రాకుండా చేసింది ఎవరన్న విషయం మాత్రం ఆమె ప్రస్తావించలేదు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more