బాహుబలి తో స్టార్ ఇమేజ్ ను సాధించేసుకున్న ప్రభాస్ సాహో అంటూ 150 కోట్ల బడ్జెట్ సినిమాకు సిద్ధమైపోయాడు. దీని తర్వాత 1960 లో యూరప్ లో జరిగిన ఓ ప్రేమకథలో నటించబోతున్నానని చెప్పేశాడు. అయితే ఒకే ఒక్క సినిమా తీసిన సుజీత్ పై ఏ నమ్మకంతో ప్రభాస్ మూవీ ఓకే చెప్పాడు? బాహుబలి తర్వాత ఈ బిగ్ రిస్క్ కాదా? టీజర్ లో జస్ట్ స్టైలిష్ నెస్ ను చూపించేయటంతో అతని పనితనం ఓహో అని అనుకోగలమా? మేకింగ్ కన్నాముఖ్యమైన కథ, దానిని ఎలివేట్ చేయటం అనే రెండు విషయాలు ఇక్కడ కీలకం కాబోతున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ అని పిలిపించుకునే ప్రభాస్ ఐదేళ్ల క్రితం సాహో ఒప్పుకుని ఉంటే పెద్ద వండర్ అనిపించేది కాదు. బడ్జెట్ కూడా ఓ మోస్తరుగానే ఉండి ఉండేది. పైగా ఒకే భాష(తెలుగు) కే అది పరిమితం అయ్యి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రభాస్ ఉత్త ప్రభాస్ కాదు.. బాహుబలి ప్రభాస్ కదా!. అందుకే చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అందుకే సుజీత్ చాలా జాగ్రత్తగా అడుగు వేయబోతున్నాడని స్పష్టమౌతోంది. ప్రతీ సినిమాలో వేరియేషన్ చూపించే ప్రభాస్, సాహో కోసం కూడా కొత్తగా తయ్యారయ్యాడు.
టీజర్ తో చెప్పింది జస్ట్ థీమ్ మాత్రమే. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా అసలు మ్యాటర్ ముందుంది. బాలీవుడ్, కోలీవుడ్ తోపాటు మన జనాలకు కూడా నచ్చేలా ప్రభాస్ ను చూపించాలి. అందుకే మూడు నెలలు కష్టపడి లుక్కును ఫైనల్ చేసి ఓ ఫోటో షూట్ చేయించి వదిలాడు. ఎట్రాక్షన్ గా నేషనల్ వైడ్ టెక్నీషియన్స్ ను ఎంచుకుని ముందుకు సాగిపోనున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవుట్ ఫుట్ విషయంలో మాత్రం ఇప్పుడున్న కుర్ర దర్శకుల్లా కాకుండా సీనియర్ల మాదిరి కష్టపడి సినిమా తీయాల్సిందే. అప్పుడే ప్రభాస్ ఇమేజ్ కు డ్యామేజ్ కాకుండా, తన పేరును కూడా పాపులర్ చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more