Honey Trap Actress targeted Married Men and Arrested

Small time actress arrested in honey trap

Pooja Jadav, Pooja Jadhav arrested, Short Film Actress Trap men, Actress Trap Married Men, Actress Extorted Men, Heroine Black Mail, Actress Illegal Relation Arrest, Honey Trap Group Actress

Small Screen Actress Pooja Jadav Arrested in Honey Trap Racket. Falsely Accused 10 Men of Rape and Extorted Lakhs of Money in Pune.

మాయ మాటలతో అక్రమ సంబంధం.. హీరోయిన్ అరెస్ట్

Posted: 07/13/2017 10:22 AM IST
Small time actress arrested in honey trap

క్రైం సీరియళ్లలో నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ నటిని పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. బడా బిజినెస్ మెన్ లతో సంబంధం పెట్టుకుని, ఆపై వారు డబ్బులివ్వకపోయేసరికి అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని బ్లాక్ మెయిల్ కి దిగుతుంది. ఆపై అతన్ని వదిలేసి మరోకరిని పట్టుకుంటుంది. ఇలా ఐదేళ్లలో 50 లక్షల దాకా వెనకేయటమే కాదు, తనకంటూ ఓ సొంత గ్యాంగ్ ను మెయింటెన్ చేస్తోంది.

పూజా జాదవ్ షార్ట్ ఫిల్మ్స్ తోపాటు సోనీలో ప్రసారం అయ్యే క్రైం పెట్రోల్ లోనూ నటించింది. ముంబైకి చెందిన ఓ సంస్థ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ లో ఈ మధ్య ఆమె నటించింది. ఆ సమయంలో చిత్ర యూనిట్ కు చెందిన యువకుడిని ప్రేమ ముగ్గులోకి దించింది. ఆపై అతనితో శారీరక సంబంధం పెట్టుకుని, 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. అతను నిరాకరించడంతో అత్యాచారం చేశావని కేసు పెడతానని బెదిరించి చివరకు వివాహం చేసుకుంది.

అయితే ఆమె అసలు ఉద్దేశం తర్వాత అతనికి అర్థమైంది. ఓ రోజు కావాలనే గొడవ పెట్టుకుని మరికొందరు ఇంటికి రప్పించి అతనిపై దాడి చేసి 6000 రూపాయలతో పరారైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో రెండేళ్ల క్రితం అలాగే ఒకరిని ఆమె వేధించిందని గుర్తించారు. 2014లో ఓ బ్యాచ్ ను ఏర్పాటు చేసింది. నలుగురు అమ్మాయిలు, ఓ యువకుడు ఈ గ్రూప్ లో ఉన్నారు. పెళ్లయిన వ్యక్తులను, వ్యాపారస్థులను టార్గెట్ చేస్తూ పేర్లు మార్చుకుంటూ వీళ్లు ఇదే తంతు కొనసాగించేవారంట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పూజా నాలుగు నెలల గర్భవతి అయినా ఇప్పుడు మరోకరిని టార్గెట్ చేసి పెళ్లికి సిద్ధమైపోయింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja Jadhav  Honey Trap Racket  Actress Arrested  

Other Articles