Nuisance Case filed against Actor Fish venkat

Case filed on fish venkat

Fish Venkat, Actor Fish Venkat, Police Case Against Fish Venkat, Nuisance Case Fish Venkat, Fish Venkat Arrest, Fish Venkat Case, Fish Venkat News, Fish Venkat Drunk, Tollywood Comedian Drunk and Rucks, Police Case Fish Venkat

Fish Venkat the comedian is known for few comic roles in Telugu cinema, Fish Venkat is posting a good saga in Telugu and was into news now for the wrong reason. Kothagudem people filed a case on Fish Venkat where in they say he drunk a lot and gave a huge blow to their faces in the midnight. "

తప్పతాగి రౌడీయిజం.. ఫిష్ వెంకట్ పై కేసు

Posted: 07/12/2017 04:28 PM IST
Case filed on fish venkat

తనదైన మార్క్ డైలాగులతో ప్రేక్షకులను నవ్వించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ వార్తల్లో నిలిచాడు. విలన్ వేషాలతోపాటు కామెడీ టైమింగ్ తో మెప్పించే ఈ నటుడు బయటకూడా అలాంటి వ్యవహారంతోనే బుక్కయ్యాడు. ఓ ఫ్యామిలీని బెదిరించిన కేసులో కొత్తగూడెం పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

నటుడు వెంకట్‌కు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ కూతురును కొత్తగూడెంలోని ఏ పవర్‌హౌజ్‌ బస్తీకి చెందిన మెడికల్‌షాపు లో పనిచేసే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. మధ్య మధ్యలో ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు కూడా. గత నెల 30వ తేదీన అర్ధరాత్రి మద్యంతాగి వచ్చి కూతురి పక్కింట్లో ఉండే వేముల ప్రసాద్ తో గొడవ పడ్డాడు. దీంతో పోలీసులు సర్దిచెప్పి పంపించారు. మళ్లీ వారం తర్వాత ఇలాగే గొడవకు దిగగా, ఈసారి కూడా పోలీసులు ఇరు పక్షాలను సముదాయించారు, వెంకట్ కు వార్నింగ్ ఇచ్చారు.

అయినా వెంకట్ తీరు మారలేదు. మూడు రోజలు క్రితం పది మందిని వెంటేసుకుని వేముల ప్రసాద్ తోపాటు కుటుంబ సభ్యులు ఉపేంద్ర, రాజేశ్ లపై దాడి చేయబోయాడు. దీంతో బాధితులు మళ్లీ పోలీసులకు ఆశ్రయించగా, నటుడిపై కేసు నమోదు చేశారు. వెంకట్ ప్రవర్తన తరచూ ఇలాగే ఉంటుందని, గతంలోనూ చుట్టుపక్కల వాళ్లతోనూ దురుసుగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fish Venkat  Tollywood News  Police Case  

Other Articles