Taapsee What About Sridevi and Ramya Krishna

Taapsee navel obsession comments legendary director

Taapsee Pannu, Taapsee Raghacendra Rao, Taapsee Movie Trouble, Telugu Fans Fire Taapsee, Taapsee Comments on Legendary Director, Taapsee Anando brahma, Taapsee Controversial Comments, Taapsee Tollywood, Taapsee Comments Tollywood Director, Taapsee Trolled, Actress Taapsee Pannu Comments, Raghavebdra Rao Navel Obsession

Actress Taapsee Pannu stirs a controversy after taking a dig at director Raghavendra Rao. Telugu fans fire on Her.

శ్రీదేవి, జయప్రద ఎలా వచ్చారు? టబు, రమ్యకృష్ణ బొడ్డుపై కొట్టించుకోలేదా?

Posted: 07/11/2017 10:51 AM IST
Taapsee navel obsession comments legendary director

సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుపై హీరోయిన్ తాప్సీ ఇటీవల వెకిలి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'ఝుమ్మంది నాదం' సినిమా షూటింగులో రాఘవేంద్రరావు సినిమాపై కాకుండా తన బొడ్డుపై కొబ్బరికాయ, పూలు విసరడం మీదే దృష్టిపెట్టాడంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతోంది.

తెలుగులో అవకాశాలు కరువవుతుండటంతో ఆ మధ్య బాలీవుడ్ లో యత్నాలు చేసిన తాప్సీగా బాగానే అవకాశాలు వచ్చాయి. దీంతో ఛాన్స్ దొరికినప్పుడల్లా తెలుగు ఇండస్ట్రీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. ఆ మధ్య హీరోల డామినేషన్ అంటూ అగ్రహీరోలపై సంచలన వ్యాఖ్యలే చేసింది. ఇక ఇప్పుడు తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శక దిగ్గజం పైనే కామెంట్లు చేయటంతో తెలుగు సినీ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డుతున్నారు.

శ్రీదేవి, జయసుధ లాంటి హీరోయిన్లు ఎలా వచ్చారో నీకు తెలుసా? టబు, రమ్యకృష్ణ, రంభ వీళ్లంతా ఆయనతో బొడ్డు మీద పూలు, పండ్లు వేయించుకున్న వాళ్లే. వాళ్లు స్టార్లు అలానే అయ్యారు. ఒకవేళ ఆయనతో సినిమా తీయకుంటే నీ బతుకు ఎక్కడ ఉండేది? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతు బూతు పురాణం అందుకుంటున్నారు.

మరోవైపు తెలుగులో ఆమె నటించిన 'ఆనందో బ్రహ్మ' అనే హారర్ కామెడీ సినిమా విడుదలకు రెడీ అయింది. దీంతో ఆ సినిమాను బహిష్కరించాలని రాఘవేంద్ర రావు అభిమాన సంఘాలు పిలుపునిచ్చాయి. వివాదం ప‌ట్ల తాప్సీ స్పందించని నేపథ్యంలో నిర్మాతలకు భారీ నష్టమే జరిగేట్లు కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taapsee  Raghavendra Rao  Navel Obsession Comments  

Other Articles