Pawan not interested on Rakul for New Movie

Rakul not yet confirm for pawan

Rakul Preet Singh, Rakul Preet Singh Pawan Kalyan, Pawan Kalyan Rakul, Rakul Pawan, Pawan 26th Movie, Pawan Santosh Srinivas Movie, Pawan New Heroine, Pawan not Nos for Rakul, Pawan 26th Movie Heroine, Pawan Rakul Movie

Rakul Preet Singh for Pawan kalyan New Movie under Santosh Srinivas Direction. But, Makers not yet confirmed yet.

రకుల్ కోరిక.. పవన్ కి ఇంట్రెస్ట్ లేదా?

Posted: 07/11/2017 12:17 PM IST
Rakul not yet confirm for pawan

లక్ ఫ్లస్ బ్యూటీనెస్ కలగలిపిన సుందరి రకుల్ ప్రీత్ సింగ్ టాప్ టాప్ హీరోలతో జోడీ కడుతూ వస్తోంది. టాలీవుడ్ తోపాటు కోలీవుడ్, ఆపై బాలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్టులను తన ఖాతాలో వేసేసుకుంది. ఇది చాలదన్నట్లు వరుసగా ఈ మధ్య మెగా ఫ్యామిలీ హీరోలతో నటించే ఛాన్స్ దొరుకుతోంది. 'బ్రూస్ లీ' సినిమాలో చరణ్ తో పాటు చిరంజీవితోను ఓ సీన్లో కనిపించి మెగా స్టార్ తోను చేశాననే ముచ్చట తీర్చుకుంది.

సరైనోడుతో బన్నీతో, విన్నర్ తో సాయిధరమ్ తేజ్ తోను సందడి చేసింది. త్వరలో వరుణ్ తేజ్ తో చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలే కోరిక మాత్రం తనకు చాలా ఉందంటూ రకుల్ చెబుతూ వస్తోంది. అయితే పవన్ రాజకీయాల నేపథ్యంలో అది నెరవేరే ఛాన్స్ తక్కువగా ఉన్నాయంటూ వార్తలు వినపించాయి. ఈ నేపథ్యంలో పవన్ తర్వాతి ప్రాజెక్టులో రకుల్ కన్ఫర్మ్ అయ్యిందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

త్రివిక్రమ్ సినిమాతో తర్వాత దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఓ సినిమా చేయనున్నట్లు తెలిసిందే. ఆ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకోవాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో, ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. రెమ్యునరేషన్ తక్కువైనా సరే ఛాన్స్ వదులుకోవద్దన్న థాట్ లో రకుల్ ఉందని సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Pawan kalyan  Santosh Srinivas Movie  

Other Articles