Rana's Movie gets its Release Date

Rana new movie release date

Rana, Nene Raju Nene Mantri, Nene Raju Nene Mantri Release Date, Nene Raju Nene Mantri Rana, Rana New Movie Release, Raja Teja Movie Release, Raja Kajal Catherine Release Date

Rana Dagubbati Nene Raju Nene Mantri Release date Announced. Teja's Directorial Political venture release on August 11th.

రానా కు యంగ్ హీరోతో ట్రబుల్స్

Posted: 07/07/2017 01:34 PM IST
Rana new movie release date

బాహుబలి తర్వాత రానా రేంజ్ బాగా మారిపోయింది. అప్పటిదాకా కేవలం నార్త్, తెలుగు మూవీలతోనే గడిపేసిన రానా, ఐదేళ్ల శ్రమకు తగ్గట్లుగానే ఛాన్సులు పడుతున్నాడు. కన్నడతోపాటు కోలీవుడ్, తెలుగు లో క్రేజీ ప్రాజెక్టులు ఇప్పుడు రానాకు క్యూ కడుతున్నాయ్. దీంతోపాటు ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.

తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా, కాజ‌ల్ జంట‌గా నటించిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగ‌స్టు 11న విడుద‌ల చేయ‌నున్నట్లు నిర్మాత సురేష్ బాబు నటించాడు. కంప్లీట్ పొలిటికల్ సెటైరిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెస్సా కూడా ఓ కీ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది కూడా.

రానాలో కొత్త యాంగిల్ ను చూపించానంటున్నాడు దర్శకుడు తేజ. ఈ నెల చివర్లో ఆడియో, ప్రీ రిలీజ్ కానిచ్చేసి అనుకున్న టైంకి సినిమాను రిలీజ్ చేస్తామంటున్నాడు. మరోవైపు బాహుబలి 2 త‌ర్వాత రానా న‌టించిన చిత్రం కావటంతో ఆసక్తి నెలకొంది. అయితే అదే టైంకి బాలీవుడ్ నుంచి పెద్ద చిత్రాలు వస్తున్నప్పటికీ, తెలుగులో నితిన్ లై కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేయటంతో పోటీ తప్పేలా కనిపించటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Director Teja  Nene Raju Nene Mantri  Release Date  

Other Articles