Actor Finally Arrested for Killing Model in Accident

Model death actor vikram chatterjee arrested

Bengal model Anchor, Sonika Chauhan Death Case, Sonika Chauhan News, Sonika Chauhan Death Vikram Chatterjee, Vikram Chatterjee Arrest, Vikram Chatterjee Sonika Chauhan, Sonika Chauhan Death, Sonika Chauhan Accident

Bengal model-anchor Sonika Chauhan Death Case. Actor Vikram Chatterjee, who is facing a culpable homicide charge for the car crash in which model-anchor Sonika Chauhan was killed in April, was arrested in Kolkata this morning.

తాగి నడిపే ఆ హీరోయిన్ ను చంపాడు

Posted: 07/07/2017 11:02 AM IST
Model death actor vikram chatterjee arrested

యాక్సిడెంట్ లో తన తోటి నటిని బలి తీసుకున్న నటుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ ఈ ఏప్రిల్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. బుల్లితెర నటుడు విక్రమ్ చటర్జీని ప్రమాదం సమయంలో ఆమె పక్కనే ఉన్నాడని, అతి వేగంతో ఆమె మృతికి కారణమయ్యాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విచారణలో భాగంగా అదంతా నిజమేనని తేలటంతో ఛటర్జీని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. 304 తోపాటు పలు సెక్షన్ల కింద నమోదు కావటంతో పదేళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది. అయితే పక్కా ఆధారాలు లేనందున కేవలం నిర్లక్ష్యంగా నడిపాడన్న కారణం చేత 2 ఏళ్లు శిక్ష పడే అవకాశం లేకపోలేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. బెంగాలీలో ఓ పాపులర్ షోతోపాటు పలు టీవీ సీరియళ్లలో విక్రమ్ లీడ్ రోల్ చేస్తున్నాడు.

ఏప్రిల్ 29న వీరిద్దరూ ఓ పార్టీలో పాల్గొన్నారు. ఇద్దరూ కలసి మందు కొట్టారు. ఆపై కారులో తిరిగి వస్తున్న వేళ, మితిమీరిన వేగం కారణంగా అదుపు తప్పి పల్టీలు కోట్టి ఫుట్ పాత్ పైకి వెళ్లి, ఓ దుకాణాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో సోనికా అక్కడికక్కడే మృతి చెందగా, విక్రమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే తానేం మద్యం సేవించలేదని విక్రమ్ బుకాయించినప్పటికీ, తర్వాత ఫోటోలు బయటికి రావటంతోపాటు వైద్యుల నివేదిక కూడా అది నిజమని తేల్చింది.

ఒకానోక టైంలో అధికార పక్షం నేతలు అతన్ని కాపాడేందుకు రక్షించాలని యత్నిస్తున్నారంటూ కేసు రాజకీయ రంగు పులుము కోవటం విశేషం. చివరకు ఆరోపణలు రుజువు కావటంతో ఛటర్జీని అతని ఇంట్లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonika Chauhan  Death Case  Vikram Chatterjee Arrest  

Other Articles