Porn Star Punches to Die Hard Fan for Clicking Selfie

Adult star fan moment turns wrong

Porn star Mia Khalifa, Mia Khalifa, Adult Star Punch Fan, Fan Punched by Adult Star, Actress Punch Fan, Mia Khalifa, Photo with Porn Star, Actress Selfie Fan Hurt

Porn star Mia Khalifa accused of punching fan for taking selfie without permission. later he posted those photos Criticism on Mia. Adult star Explanation that she understood that he was trying to grab her.

పోర్న్ స్టార్ తో ఫోటో.. వైరల్ అవుతోందిగా...

Posted: 06/29/2017 11:51 AM IST
Adult star fan moment turns wrong

తమ ఫేవరెట్ సెలబ్రిటీని చూడగానే ఉత్సహాం ఆపుకోలేక ఎగబడిపోతుంటారు వెర్రితలలు వేసిన అభిమానులు. అయితే వాళ్లు చేసే అతితో ఒక్కోసారి సెలబ్రిటీలకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. గుంపులు గుంపులుగా చేరి సందట్లో సడేమియా లాగా వారిని నలిపేయటం ఫిమేల్ సెలబ్రిటీల విషయంలో చాలానే చూశాం. అందుకే స్టార్లు కూడా బయటకు వెళ్లే సమయంలో వాళ్ల జాగ్రత్తలో వాళ్లు ఉంటున్నారు.

తన ముందు ఓ పోర్న్ స్టార్ వెళుతుంటే... ఉత్సాహంతో కూడిన తనలోని అభిమానాన్ని బయటపెట్టాడో యువకుడు. ఎలాగైనా సరే ఆమెతో ఓ ఫోటో క్లిక్ మనిపించుకోవాలని ట్రై చేశాడు. అంతే ఆపై ఆమెతో ఓ 'పంచ్' తిన్నాడు. శృంగార దేవత మియా ఖలీఫా టెక్సాస్ లోని పర్యాటక ప్రాంతానికి వెళ్లింది. ఆమె ఒంటరిగా నడిచి వెళుతుంటే, హడ్ స్పెత్ అనే యువకుడు చూశాడు. ఆమెతో సెల్ఫీ దిగాలని అనుకున్నాడు. అనుమతి తీసుకోకుండానే సెల్ఫీలు తీసుకుంటుంటే, ఖలీఫా ఓ గట్టి పంచ్ ఇచ్చింది.

అయితే హడ్ స్పెత్ మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. ఆ ఫోటోలను ట్విట్టర్ లో పెట్టాడు. తన ఫేవరెట్ స్టార్ ను అడక్కుండా ఫోటోలు తీసినందుకు ఇచ్చిన నజరానా ఇది అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై విమర్శలు రావటంతో ఖలీఫా స్పందించింది. సదరు యువకుడు అతి దగ్గరగా వస్తుండటంతో అసభ్యంగా ప్రవర్తిస్తాడన్న భయంతో ఓ కిక్ ఇచ్చానని చెప్పి, చివర్లో అతనికి క్షమాపణలు తెలిపింది. పాపం అందులో మియా తప్పేముంది చెప్పండి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mia Khalifa  Adult Star  Punch Fan  Selfie Moment  

Other Articles