Jawan Movie Release Date Announced

Jawan movie release date

Sai Dharam Tej, Jawan Movie, Jawan Movie Release Date, Jawan Release Date, Sai Dharam Tej Jawan

Sai Dharam Tej Jawan Movie Release Date Announced. BVS Ravi

జవాన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు

Posted: 06/28/2017 06:55 PM IST
Jawan movie release date

సెప్టెంబర్ చివరి వారం నుంచి బడా సినిమాలు బరిలోకి దిగటం ప్రారంభిస్తున్నాయి. అందుకే ఈ లోపే చిన్న సినిమాలను రిలీజ్ చేసుకోవాలని నిర్మాతలు భావించేస్తున్నారు. ఇందులో భాగంగా రానా, సాయి ధరమ్ తేజ్ లు కూడా తమ అప్ కమింగ్ ప్రాజెక్టులను ముందుకు జరిపేసుకున్నారన్న ఓ వార్త వెలువడింది. రానా నుంచి అది క్లారిటీ లేకపోయినా తేజు సినిమా మాత్రం ముందుకు జరిగినట్లే చెప్పుకున్నారు.

బీవీఎస్ రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, పోస్టర్లు అంచనాను పెంచేశాయి. ఇంతలో ఆగస్టు 11న విడుదల చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైంకి నితిన్ లై సినిమా ఉండటంతో విడుదలను మరో వారం వాయిదా వేసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో ఏదీ నిజం లేదని మేకర్లు ప్రకటించేశారు.

సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. నిర్మాత కృష్ణ ఇదో కంప్లీట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నాడు. షూటింగు పార్టును జూలైలో పూర్తి చేసి .. మిగతా పనులను ఆగస్టులో కానిచ్చేసి .. సెప్టెంబర్ 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే అదే టైంకి మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు లైన్ అప్ లో ఉండటంతో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని అంటున్నారు. మెహ్రీన్ కౌర్ సాయికి జతగా నటిస్తుండగా, థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jawan Movie  Sai Dharam Tej  Release Date  

Other Articles