Leaked Images From Jai Lava Kusa Create Hype

Jai lavakusa teaser leak effect

Junior NTR Jai Lava Kusa, Jai Lava Kusa, Jai Lava Kusa Teaser Leak, Jai Lava Kusa teaser Leak Photos, Jai Lava Kusa Leak Photos, NTR Teaser Leak, Jai Lava Kusa Leakage, Tollywood Leakages

Junior NTR Jai Lava Kusa Movie Teaser Leaked Video Creating Lots of Buzz in Social Media. Culprit Ganesh Arrested

జైలవకుశ టీజర్ లీక్.. డ్యామేజ్ కాదు హైప్

Posted: 06/28/2017 03:14 PM IST
Jai lavakusa teaser leak effect

జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ టీజర్ లీక్ కావటం, గంటల వ్యవధిలోనే నిర్మాత కళ్యాణ్ రామ్ స్పందించటంతో అది వైరల్ అవ్వటం ఆగిపోయింది. అయితే అప్పటికే కొన్ని వెబ్ సైట్లు స్క్రీన్ షాట్లు, వీడియో ఎడిటింగ్ ల రూపంలో పెట్టేయంతో అవి ఇప్పుడు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. మరోపక్క నిందితుడు గణేష్ పై కళ్యాణ్ రామ్ ఫిర్యాదు చేయటంతో అతన్ని కటకటాల వెనక్కి నెట్టేశారు.

ఇదిలా ఉంటే ఈ లీకేజీ ఒక రకంగా సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఎన్టీఆర్ లుక్కుతోపాటు అందులో కట్ చేసిన సీన్లకు సంబంధించి ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. రావణాసురుడి విగ్రహం ముందు ఎన్టీఆర్ నడిచి వస్తుంటే, వెనక ఓ ఫైటర్ గాల్లోకి ఎగురుతున్నట్టు ఉన్నట్లు, ఆపై ఏనుగు దంతాల వంటి ఆకృతి గల సింహాసనంపై చేయికి మెటల్ చెయిన్ కట్టుకుని, ఓ గండ్ర గొడ్డలి పట్టుకుని ఎన్టీఆర్ వికటాట్టహాసం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

చూస్తుంటే నెగటివ్ రోల్ కు సంబంధించిన వీడియోతోనే టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు స్పష్టమౌతోంది. జూలై మొదటి వారంలోనే టీజర్ రిలీజ్ చేయాలనుకోగా, ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగు చూసింది. మరి లీక్ నేపథ్యంలో మరోకొత్త టీజర్ తో చిత్ర యూనిట్ మన ముందుకు వస్తుందా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Jai Lava Kusa  Teaser Leak  

Other Articles