Choreographer Controversial Comments On Creative Director

Choreographer rakesh sensational comments

Choreographer Rakesh, Rakesh Master, Choreographer Controversial Comments, Krishna Vamsi Rakesh, Krishna Vamsi Prabhas, Krishna Vamsi Rakesh Comments, Tollywood Choreographer Controversial Comments, Choreographer Rakesh Interview, Director Krishna Vamshi

Choreographer Rakesh Master Controversial Comments On Krishna Vamsi and Prabhas. Krishna Vamsi Worst Director and Prabhas Character change after stardom.

షాకింగ్ కామెంట్స్: కృష్ణవంశీ వరస్ట్ డైరక్టర్.. ప్రభాస్ క్యారెక్టర్ మారింది

Posted: 06/28/2017 01:14 PM IST
Choreographer rakesh sensational comments

టాలీవుడ్ లో ఆఫ్ స్క్రీన్ వ్యవహారాలు బయటకు రావటం లేదని ఫీలయ్యే జనాల కోసం కొత్తగా ఓ ట్రెండ్ ను మొదలుపెట్టేశారు. చిన్న చితకా ఆర్టిస్ట్ ల దగ్గరి నుంచి సీనియర్లను ఎంచుకుని, వారితో ప్రైవేట్ గా ఇంటర్వ్యూలు కానిచ్చి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నాయి కొన్ని చానెళ్లు. కాంట్రవర్సీ ప్రోమోలను కట్ చేయటం, తద్వారా జనాల్లో ఎగ్జయిటింగ్ పెంచి వాటి కోసం ఎదురు చూసేలా చేయటం తెలిసిందే.

రీసెంట్ గా టాలీవుడ్ లో కాస్త పెద్ద డైరక్టర్లతోనే పని చేసిన అనుభవం ఉన్న డాన్స్ మాస్టర్ రాకేష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు తెగచక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా క్రియేటవ్ డైరక్టర్ కృష్ణవంశీని కాస్త పరుష పదజాలంతోనే దూషించటం చర్చనీయాంశంగా మారింది. అందరూ క్రియేటివ్ డైరెక్టర్ అని అంటుంటారని... కానీ తన దృష్టిలో మాత్రం ఓ బచ్చా అంటూ విమర్శించాడు. 'చక్రం' సినిమాలో 'జగమంత కుటుంబం నాది' అనే పాటకు రాకేష్ కొరియోగ్రఫీ చేశాడు. 11 రోజుల పాటు ఆ పాటకు పని చేశానని... అయితే, తనను పక్కన పెట్టి ఆయనే అన్ని పనులు చూసుకున్నాడని మండిపడ్డాడు. చివరకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తాడు. అందుకే హిట్లు లేక ఇప్పుడు సతమతమవుతున్నాడంటూ చెప్పుకొచ్చాడు.

 

ఇక హీరో ప్రభాస్ కు తాను డాన్స్ గురువునని చెప్పుకున్న రాకేష్, స్టార్ డమ్ వచ్చాక తనని పక్కన పెట్టేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన శిష్యుడు శేఖర్ మాస్టర్ తో ప్రభాస్ ఇంటికి వెళ్లినప్పుడు.. అక్కడ మేనేజర్ గా ఉన్న ప్రభాస్ శీను 'మీరెవరు?' అంటూ అడ్డుకున్నాడని, తాను వచ్చానన్న విషయం లోపలికెళ్లిన చెప్పాక, ఉండి కూడా ప్రభాస్ లేడని చెప్పిన మాటలు తన చెవి పడ్డాయని, అప్పటి నుంచి ఎవరినీ అంత తేలికగా నమ్మకూడదన్న విషయం అర్థమైందన్నాడు. కెమెరా ముందు ఈ విషయాలు చెప్పటం తనకేం భయంగా లేదని, పైగా సోసైటీకి ఇలాంటి విషయాలు తెలియాల్సిన అవసరం ఉందంటూ రాకేష్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ నెట్ లో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Choreographer Rakesh  Controversial Comments  Prabhas  Krishna Vamshi  

Other Articles