Bollywood Actor Shocking Revelation about Vivegam

Ajith vivegam movie budget

Vivegam, Vivegam Budget, Vivegam Vivek Oberai, Vivek Oberoi about Ajith Kumar, Vivek Oberoi Thala, Vivek Oberoi South Movie, Ajith 120 Crores Budget

Surpring Budget for Ajith Kumar Next. With 120 Crores Budget Vivegam filmed Bollywood Actor Vivek Oberoi reveal.

తలా మూవీ బడ్జెట్.. ఫ్యాన్స్ భయపడిపోతున్నారుగా...

Posted: 06/26/2017 02:09 PM IST
Ajith vivegam movie budget

కోలీవుడ్ లో గత కొన్నేళ్లుగా తలా అజిత్ సినిమాలన్నీ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తూ వస్తున్నాయి. మంగత్తా(తెలుగులో గ్యాంబ్లర్) దగ్గరి నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన వేదాళం దాకా అన్ని
ఇంచుమించుగా 100 కోట్ల క్లబ్ కి చేరువయినవే. అయితే 40, 50 కోట్ల పెట్టుబడితో ఆ లెక్క రాబట్టడం పెద్ద కష్టమేం కాకపోయినా వివేగం విషయంలో మాత్రం అది అంతకు మించే కనిపిస్తోంది. అజిత్ తాజా చిత్రం మాత్రం షాకింగ్ బడ్జెట్ తో తెరకెక్కుతుందని సమాచారం.

ఈ విషయాన్ని సినిమాలో కీ రోల్ పోషిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. సినిమా చాలా రిచ్ గా తెరకెక్కుతోందని.. దీని కోసం తాను యూరప్ లో చాలా చాలా దేశాలు తిరిగానని, బడ్జెట్ అటు ఇటుగా 120 కోట్లు అని క్లారిటీగా చెప్పుకొచ్చాడు. హాలీవుడ్ ప్రమాణాలతో సినిమా తెరకెక్కుతున్నట్లు.. ఇందులో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు వివేక్ తెలిపాడు. అయితే తాను చేస్తున్న రోల్ ఏంటో మాత్రం ఇతగాడు రివీల్ చేయలేదు.

అజిత్ డూప్ ల సాయం లేకుండా చేసిన స్టంట్లు చూసి షాక్ కి గురయ్యానని, తన పాత్ర కూడా అజిత్ తో సినిమా మొత్తం ట్రావెల్ అవుతుందని చెప్పాడు వివేక్. అయితే బడ్జెటే రూ.120 కోట్లు కాబట్టి కనీసం 180 కోట్లు సాధిస్తేనే తప్ప డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్స్ లేదన్నది ట్రేడ్ వర్గాల సమాచారం. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న వివేగం ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vivek Oberoi  Vivegam  Ajith Kumar  

Other Articles