Miss Haryana Crowned Femina Miss India 2017

Haryana girl crowned femina miss india 2017

Miss India 2017, Femina Miss India 2017, Manushi Chhillar, Manushi Chhillar Bio Data, Manushi Chhillar, Medico to Miss India, Femina Miss India 2017 Winners List, Haryana Girl Manushi Chhillar, Manushi Chhillar Sana Dua and Priyanka Kumari, Manushi Chhillar Details, Manushi Chhillar Hot

Femina Miss India 2017 has finally got its three new faces. Haryana Girl Manushi Chhillar declared Miss India 2017. Sana Dua and Priyanka Kumari Runner Ups.

హర్యానా సోయగంకే మిస్ ఇండియా 2017

Posted: 06/26/2017 02:01 PM IST
Haryana girl crowned femina miss india 2017

54వ ఫెమినా మిస్ ఇండియా కిరీటం హర్యానా సోయగం మనుషి చిల్లార్ కు దక్కింది. 2017 కుగానూ మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ ను దక్కించుకోగా, జమ్ము కశ్మీర్ సనా దువా ఫస్ట్ రన్నరప్, బీహార్ కు చెందిన ప్రియాంక కుమారి సెకండ్ రన్నరప్ గా నిలిచింది.

ఆదివారం రాత్రి యశ్ రాజ్ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో గత సంవత్సరం విజేత ప్రియదర్శినీ చటర్జీ, మానుషీకి అందాల రాశి కిరీటాన్ని అలంకరించింది. ఇండియన్ కల్చర్ రౌండుతో పాటు న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పిన మానుషీ విజేతగా నిలిచింది.

ఇక తెలంగాణ నుంచి పోటీలకు వెళ్లిన సిమ్రాన్ చౌదరికి మిస్ టాలెంట్ కేటగిరీ టైటిల్ తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఫైనల్ పోటీలకు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్ హోత్రా దుస్తులను డిజైన్ చేయగా, ఆభరణాలను శోభా శ్రింగార్ అందించారు. మానుషి తల్లిదండ్రులు డాక్టర్లు కాగా, సోనేపట్ లోని భగత్ పూల్ సింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతోంది. జూలై 9న మధ్యాహ్నం ఒంటిగంటలకు ఈ కార్యక్రమం కలర్స్ ఛానెల్ లో ప్రసారం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haryana  Manushi Chhillar  Femina Miss India 2017  

Other Articles