DJ Audience Confused with Dil Raju's Surprise

Mega hero trailer no one care

Dil Raju, Dil Raju DJ Result, Dil Raju New movie, Dil Raju Fida Trailer, Dil Raju Surprise Confusion, DJ Intermission, Dil Raju Mega Hero, Fida Trailer Review, Varun Tej Fida Trailer

Dil Raju surprise in Duvvada Jagannadham Interval. HIs New Movie Fida trailer out at Intermission and not impressed.

మెగా హీరోను మరీ ఇంత లైట్ తీస్కున్నాడా?

Posted: 06/23/2017 04:11 PM IST
Mega hero trailer no one care

మెగా హీరోల్లో ఇప్పుడు సక్సెస్ కోసం తపిస్తున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. మెగా బ్రదర్ తనయుడిగా ముకుందతో కెరీర్ ను మొదలుపెట్టిన ఇతగాడి పెద్ద హిట్ ఇంతవరకు పడలేదు. కంచె క్రిటిక్స్ హిట్ తో క్రిష్ ఖాతాలోకే వెళ్లిపోయింది. తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్లే. అందుకే వరుణ్ కు పెద్ద హిట్ ఇప్పుడు చాలా అవసరం. ప్రస్తుతం క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ములతో ఫిదాలో చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే డీజే థియేటర్లలో ఇంటర్వెల్ లో ప్రేక్షకులకు సడన్ షాక్ ఇచ్చాడు దిల్ రాజు. తన బ్యానర్ లోనే తెరకెక్కిన ఫిదా ట్రైలర్ ను రిలీజ్ చేసేశాడు. ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం, పైగా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రమోషన్ లేకపోవటంతో అదసలు ఫిదా ట్రైలరేనా? అని కాసేపు అంతా కన్ఫ్యూన్ కి గురయ్యారు.

ఓ అమెరికా రిటర్న్ కుర్రాడు.. పక్కా తెలంగాణా పోరి లవ్ ట్రాక్. ఆ పిల్ల తిక్కకి హీరో ఇరిటేట్ అయిపోవటం, చివర్లో ప్రపోజల్ ఒప్పుకోలేదని డైలాగ్, ఆపై రొమాంటిక్ షాట్ ఇలా ఎండ్ చేశాడు. వరుణ్ తేజ్ తన కూల్ లుక్స్ తో అటు సాయి పల్లవి తన ప్రెజన్స్ తో బాగానే ఆకట్టుకున్నారు. అయితే స్టోరీ పరంగా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం కనిపించటం లేదు. ముందు యూట్యూబ్ లో రిలీజ్ చేసినా, లేదా ట్రైలర్ రిలీజ్ అవుతుందని చిన్న అనౌన్స్ మెంట్ ఇచ్చినా బావుండేదేమో అని పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Rau  Fida Trailer  DJ Movie  

Other Articles