Most Celebrity Fans for this Tollywood Hero

Too many celeb fans for junior

Junior NTR, Junior NTR Fans, Junior NTR Celebrity Fans, NTR Tulasi, NTR Kushboo, NTR Mahesh and Allu Arjun, Tarak Mantra Seniors, Tarak Movies, Junior NTR Movies, Junior NTR Fan Following

Most Celebrities from South mentioned Junior NTR name as favourite. With his Acting skills and Dance Tarak impress all south senior and contemporary Actors.

ఎన్టీఆర్ నే ఎందుకు ఎంచుకుంటున్నారంటే...

Posted: 06/23/2017 05:01 PM IST
Too many celeb fans for junior

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్లతో మాంచి జోరు మీద ఉన్నాడు. గతేడాది రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో వరుసగా అవార్డులు కొట్టేయటమే కాదు, ఫెర్ ఫార్మెన్స్ పరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకున్నాడు. అయితే ఇది కేవలం మాములు ప్రేక్షకులకే పరిమితం కాదు.. టాప్ సెలబ్రిటీల నుంచి కూడా ఉండటం విశేషం.

తెలుగులో బెస్ట్ హీరో ఎవరంటే ఇప్పుడు దాదాపు అందరూ చెప్పే ఏకైక పేరు ఎన్టీఆరే. రీసెంట్ గా సీనియర్ నటీమణి తులసీ జూనియర్ నటనపరంగానే కాదు, సీనియర్లకు ఎలాంటి గౌరవం ఇస్తాడో చెప్పటం చూశాం. ఆమె తర్వాత కుష్బూ కూడా తారక్ నామస్మరణే చేస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తెలుగులో తనకు ఎన్టీఆర్ ఫేవరెట్ అని, అతని నటన, డాన్సులు నచ్చుతాయని చెప్పింది. అంతేకాదు తనను కలిసినప్పుడు తారక్ పద్ధతిగా, హుందాగా మాట్లాడుతుంటాడని, బహుశా తాతగారి నుంచే అదంతా నేర్చుకుని ఉంటాడని పేర్కొంది.

వీళ్లే కాదు మహేష్ బాబు, అల్లు అర్జున్, కోలీవుడ్ లో శింబు, ధనుష్ లాంటి యంగ్ స్టర్లు కూడా తారక్ పేరునే తమ ఫేవరెట్ అని ప్రస్తావించటం చూశాం. అంతెందుకు సీనియర్ హీరో కృష్ణ కూడా ఒకానోక టైంలో ఎన్టీఆర్ ఎనర్జిటిక్ ఫెర్ ఫార్మెన్స్ గురించి స్పెషల్ కాంప్లిమెంట్ ఇచ్చాడు కూడా. ఇంత మంది తారక మంత్రం జపిస్తున్నారంటే ఖచ్ఛితంగా ఎన్టీఆర్ లో అందుకు తగ్గ స్టఫ్ ఉందన్న మాట ఒప్పుకుని తీరాల్సిందే కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Favourite Actor  Senior Actors  

Other Articles