Vijay's Next Title and First Look Launch Date

Vijay 61 first look title

Vijay 61, Vijay 61 First Look, Vijay 61 Title, Vijay 61 Birthday, Vijay Atlee First Look, Vijay Kajal Samantha, Vijay Nithya Menon, Vijay New Movie, Vijay Vijayendra Prasad

Vijay 61 first look and title launch: An early birthday treat for Ilayathalapathy fans. Murali Ramasamy & Hema Rukmani of Thenandal Studios Ltd have announced that most awaited first look and title of Vijay 61 will be unveiled on 21st June, on the eve of actor Ilayathalapathy Vijay's birthday at 6 pm

విజయ్ 61 టైటిల్.. ఫస్ట్ లుక్ అప్పుడేనా?

Posted: 06/20/2017 05:47 PM IST
Vijay 61 first look title

రజనీ కమల్ తర్వాత కోలీవుడ్ లో విజయ్, అజిత్ లకే ఎక్కువ క్రేజ్ ఉంటుందన్నది తెలిసిందే. వీళ్లిద్దరి సినిమాలు వస్తున్నాయంటే చాలూ పెద్ద కోలాహలమే నెలకొంటుంది. అదే సమయంలో ఒకరి ఫ్యాన్స్ మరొకరిపై ట్రోల్స్ తో కూడా సోషల్ మీడియాలో వివాదాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ తన 61వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

రాజా రాణి ఫేమ్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. అయితే అభిమానుల కోసం ఈ నెల 22న ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారంట. విజయ్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారు. పవర్ ఫుల్ టైటిల్ తో పాటు ఫస్టు లుక్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.

70వ దశకం బ్యాగ్రౌండ్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కాజల్, సమంతా మరియు నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ చేసిన 'తేరి' సినిమా ఘన విజయాన్ని సాధించింది. దీపావళికి చిత్రం రిలీజ్ చేసే ఫ్లాన్ లో ఉన్నారు. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా, రెహ్మన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  61 Movie  First Look  

Other Articles