Actor Manchu Manoj to Quit Movies

Manchu manoj makes shocking statement

Manchu Manoj, Tollywood Hero Retirement, Manchu Hero, Manoj Quit Movies, Manchu Manoj Reason, Manchu Manoj Retirement Reason, Manchu Hero Quit Movie, Manchu Manoj Producer Avatar, Manchu Manoj Politics, Manchu Lakshmi Manoj Politics, Hero Retirement, Tollywood Hero Retire, Hero Quit Movies

Tollywood Hero Manchu Manoj Makes Shocking Statement. Manchu hero announces his retirement.The actor failed to score a blockbuster in his career though he has a series of impressive movies.

మంచు మనోజ్ రిటైర్ మెంట్.. తీవ్ర విమర్శలు...

Posted: 06/14/2017 10:14 AM IST
Manchu manoj makes shocking statement

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హీరోగా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. తన సోషల్ మీడియాలో లో కాసేపటి క్రితం ఈ విషయాన్ని తెలియజేశాడు. సీనియర్ హీరో, నిర్మాత మోహన్ బాబు చిన్న తనయుడైన మనోజ్ మేజర్ చంద్రకాంత్ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు. ఆపై దొంగ దొంగది తో హీరోగా కెరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

వేదం, బిందాస్, ప్రయాణం, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుతం చేస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో పాటు, అంగీకరించిన మరో సినిమాను పూర్తి చేసిన అనంతరం ఇకపై ఎలాంటి సినిమాల్లో నటించనని ప్రకటించాడు.

 

అయితే మంచు మనోజ్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కారణం మాత్రం చెప్పలేదు. తాజాగా మంచు లక్ష్మి రాజకీయాల్లోకి రానుందంటూ ప్రచారం జరిగటంతో మనోజ్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తాడేమోనన్న కథనాలు వెలువడుతున్నాయి. మరికొందరేమో నటన మాత్రమే మానేస్తాడని.. నిర్మాతగానో లేక తండ్రి వ్యాపారాలు చూసుకుంటాడేమోనని చెబుతున్నారు. ఏది ఏమైనా క్లారిటీ రావాల్సిందే రాకింగ్ స్టార్ నుంచే...

 

ట్వీట్ డిలీట్.. ఆపై విమర్శలు... 

తాను సినిమాలు వదిలేస్తున్నానని చేసిన ట్వీట్ ను వెంటనే డిలీట్ చేసిన మనోజ్ తాను చేసిన సరదా పని పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. తన నెక్ట్స్ సినిమా విషయంలో వైవిధ్యంగా ప్రకటన చేద్దామనుకున్నామని, దానికి ఇదే కరెక్టని భావించానని చెప్పాడు.  మీడియా సహా ప్రేక్షకులందరినీ బకరాలను చేసిన మనోజ్ ట్వీట్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. హిట్టు ఇవ్వటం చాతకాదు గానీ, ఇలాంటి వెటకారాలకు తక్కువేం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Retirement  Tollywood  

Other Articles