Gopi Chand Gautam nanda Teaser Review

Goutham nanda teaser released

Gopi Chand, Goutham Nanda Teaser, Gopi Chand Gautamnanda, Gopi Chand Goutham Nanda, Goutam Nanda Movie, Gopi CHand Goutam nanda Teaser, Gopi Chand New Movie Teaser, Gautam Nanda Teaser Review, Gautam Nanda Teaser, Gautam Nanda Teaser, Catherine Goutam Nanda Movie, Gautamnanda Teaser

Gopi Chand Starrer Goutham Nanda Teaser Released. Staylish and Richest movie till in Gopi Chand's Carrier.

గోపీ చంద్ గౌతమ్ నందా టీజర్ రివ్యూ

Posted: 06/12/2017 12:41 PM IST
Goutham nanda teaser released

టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ కెరీర్ లో హిట్లు ఉన్నప్పటికీ, బ్లాక్ బస్టర్ మాత్రం రికార్డు కాలేదు. పైగా సక్సెస్ ఈ మధ్య పలకరించిన దాఖలాలు లేవు. రెండు సినిమాలు(ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్) రిలీజ్ కాకుండా ఆగిపోవటం మరింత ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి టైంలో గోపీకి బ్లాక్ బస్టర్ ఖచ్ఛితంగా అవసరం.

ఇదిలా ఉంటే రచ్చ ఫేం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన చిత్రం గౌతమ్ నంద. ఈ చిత్ర టీజర్ ను ఈరోజు లాంఛ్ చేశారు. టీజర్ విషయానికొస్తే గోపీచంద్ సినిమాల్లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇదేనని సమాచారం. ఫారిన్ లోకేషన్లు, అద్భుతమైన విజువల్స్ రిచ్ అండ్ కలర్ ఫుల్ టీజర్ కట్టిపడేస్తోంది.

 

ఓ రిచ్ గాయ్ గా గడ్డం లుక్కులో సందడి చేసిన గోపీ, క్లీన్ షేవ్ తో పక్కా మాస్ కుర్రాడిగా మరో షేడ్ లో ఉన్న రోల్ లో కనిపించాడు కూడా. ఇక ఎప్పటిలాగే తన సినిమాల్లో గ్లామర్ రోల్ ను ఎక్కువగా చూపించే సంపత్ ఇందులోనూ కేథరిన్ ను వాడుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని హంగులతో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ లక్షణాలు కనిపిస్తున్న గౌతమ్ నంద ఈ మాస్ హీరోకు స్టైలిష్ హిట్ ఇస్తుందా? మళ్లీ ఫామ్ లోకి వస్తాడా? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopi Chand  Goutam Nanda  Teaser Review  

Other Articles

Today on Telugu Wishesh