Balayya and Bunny back to back to Movies

Balayya bunny back to back movies

Balayya Reddygaru Movie, Na peru suriya na illu India, Reddygaru Movie, Balayya New Movie, Balayya Bunny, Bunny Balayya, Allu Arjun Balakrishna

Tollywood Top Heroes back to back movies. Bunny with Na peru suriya na illu India and Balayya Reddygaru.

బాలయ్య-బన్నీ.. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్

Posted: 06/10/2017 06:07 PM IST
Balayya bunny back to back movies

టాలీవుడ్ లో బాలయ్య, బన్నీ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులతో ఒక్కసారిగా వార్త్లల్లో నిలిచారు. ప్రస్తుతం బాలయ్య పైసా వసూలు లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీలో చేస్తుండగా, తర్వాత చిత్రం కేఎస్ రవికుమార్ తో ఉండబోతుందని కొంత కాలం క్రితమే కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో పోర్చుగల్ నుంచి రాబోతున్న బాలయ్య రెడ్డిగారు ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉండబోతున్నాడంట.

ఇప్పటికే కే ఎస్ రవికుమార్ పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకోగా, పూరీ సినిమా 60 శాతం అయిపోవటంతో జూలై చివరి నుంచే ఈ ఫాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుందని సమాచారం. తమన్నా హీరోయిన్ గా ఆల్ మోస్ట్ సెలక్ట్ కాగా, చివరి నిమిషంలో మరో హీరోయిన్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. రజనీ కోసం తయారు చేసిన ఈ కథను బాలయ్య తీయబోతున్నాడని కొంత కాలం నుంచి టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ డీజే ఈ నెల 23 విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే దాని కంటే ముందే అంటే జూన్ 21 నుంచే బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్టును మొదలుపెట్టబోతున్నాడంట. రైటర్ వక్కంతం వంశీ డైరక్టర్ డెబ్యూ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ముహుర్తం ఆ రోజునే లాంఛ్ కాబోతుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Allu Arjun  Reddygaaru  Na Peru Suriya Na Illu India  

Other Articles