Shah Rukh avoids clash with Akshay 's Toilet

Srk not repeat kabil raees feat

Shah Rukh Khan, Akshay Kumar, Jab Harry Met Sejal Toilet Movie, Toilet Ek Prem Katha, SRK vs Akshay Kumar, SRK Release Date, Jab Harry Met Sejal, Imtiaz Ali SRK Movie

Shah Rukh Khan's film Jab Harry Met Sejal will not clash with Akshay Kumar's Toilet Ek Prem Katha anymore.

బాద్ షా టాయ్ లెట్ జోలికి పోవట్లేదంట...

Posted: 06/10/2017 12:49 PM IST
Srk not repeat kabil raees feat

స్టార్ల హీరో ఇగో ఎంతటి భారీ నష్టాన్ని తీసుకొస్తాయో బాలీవుడ్ లో ఈ యేడాది జనవరిలో ప్రత్యక్షంగా చూశాం. ఓవైపు షారూఖ్ ఖాన్ రయిస్.. ఇంకోవైపు హృతిక్ కాబిల్ లు ఒకేసారి రిలీజ్ అయ్యి పెద్ద దెబ్బలు తిన్నాయి. కంటెంట్ పరంగా కాబిల్ కే ఎక్కువ మార్కులు పడ్డప్పటికీ, కలెక్షన్ల పరంగా తన స్టార్ డమ్ తో ఎక్కువే రాబట్టాడు బాద్ షా. అయినప్పటికీ తీరిగ్గా సోలోగా వచ్చి ఉంటే షారూఖ్ లాభపడేవాడన్నది చివరకు తేలింది.

పై పెచ్చు ముందుకు మాట్లాడుకున్నట్లు తమకు థియేటర్లు దక్కకుండా చేసి షారూఖ్ పెద్ద దెబ్బే వేశాడంటూ హృతిక్ పాధర్ రాకేష్ రోషన్ తీవ్ర స్థాయిలో తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, పెను దుమారమే రేగింది. ఇదొక గుణపాఠంగా ఫ్యూఛర్ లో మళ్లీ రిపీట్ కానివ్వదంటూ షారూఖ్ కు చాలా మంది పెద్దలు సలహాలు కూడా ఇచ్చారు. అందుకే మరోసారి అలాంటి క్లాష్ జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. తన అప్ కమింగ్ మూవీ ‘జబ్ హరీ మెట్ సెజల్’ విషయంలో చాలా స్మార్ట్ స్టెప్ వేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఆగష్టు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిజానికి ఈ చిత్రం ఆగష్టు 11న విడుదల చేయాలని తొలుత షారూఖ్ భావించాడు. కానీ, అదే రోజు అక్షయ్ కుమార్ ‘టాయ్ లెట్-ఏక్ ప్రేమ్ కథ’ రిలీజ్ చేస్తామని మేకర్లు చాలా కాలం క్రితమే అనౌన్స్ చేస్తారు. అందుకే ఎందుకు వచ్చిన తంట అనుకుని సినిమాను ప్రీ పోన్ చేయించాడు షారూఖ్. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క శర్మ బాద్ షాకు జోడీగా కనిపించబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SRK  Jab Harry Met Sejal  Toilet Ek Prema Katha  Akshay Kumar  

Other Articles