Actor Vishal Reddy Clarity on Political Entry

Vishal clarity on political entry

Vishal Reddy, Actor Vishal, Vishal Political Entry, Vishal Kamal Haasan Party, Vishal Support Kamal Haasan, Kamal Haasan Hero Vishal, Hero Vishal kamal Haasan, Vishal Condemns Political Rumour, Hero Vishal Gossip

Hero Vishal opens up on Political Entry. Condemns Rumour but, hints support to Kamal Haasan in Future.

రాజకీయాల్లోకి రాను.. సపోర్ట్ ఎవరికంటే...

Posted: 06/06/2017 04:02 PM IST
Vishal clarity on political entry

కోలీవుడ్ లో ఎప్పుడైతే సినీ పెద్దలకు ఎదురెళ్లాడో అప్పటి నుంచే విశాల్ ఓ వార్తగా మారిపోయాడు. నడిగర్ సంఘం పగ్గాలు చేజిక్కిచ్చుకోవటం మొదలు.. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే దాకా ఎన్నో నాటకీయ పరిణామాలకు తెరలేపాడు. కోర్టు కేసులు, వివాదాలు చుట్టు ముట్టినప్పటికీ అయితే కొందరు స్టార్ల అండ ఉండటం, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడన్న పేరు ఉండటం విశాల్ కు బాగా కలిసొచ్చాయి.

ఓవైపు సినిమాల సంగతి చూసుకుంటూనే, మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారిన పైరసీ భూతాన్ని అణచివేసేందుకు పోరాటం, టికెట్ల పెంపును వ్యతిరేకించటం లాంటి దూకుడు చర్యలు చూపిస్తున్నాడు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న కొందరు మనోడి స్పీడు చూసి రాజకీయాల్లోకి రావటం ఖాయమనే అనుకున్నారు. అయితే ఆ రూమర్లన్నింటికి చెక్ పెట్టేశాడు విశాల్.

అసలు తనకు రాజకీయాలంటే ఆసక్తే లేదన్న విశాల్ కేవలం సినిమాలతో, కోలీవుడ్ కళాకారులకు సేవ చేస్తూనే బిజీగా ఉంటానని ప్రకటించాడు. ప్రస్తుతం ఓ మూడు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ నల్లన్నయ్య త్వరలో మోహన్ లాల్ సినిమాతో మళయాళంలో డెబ్యూ ఇవ్వబోతున్నాడు. విలన్ రోల్ లో అందులో కనిపించబోతున్నాడని టాక్. ఇక రాజకీయాలు ఇష్టం లేదని చెబుతూనే కమల్ లాంటి సీనియర్లు వస్తే మాత్రం వాళ్లకు సపోర్ట్ గా నిలుస్తానని చెబుతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Vishal  Political Entry  Condemn Rumours  

Other Articles