Adoor Gopalakrishnan Shocking Comments on Baahubali

Malayalam legendary director comments on baahubali

Baahubali 2, Baahubali 2 Pathala Bhairavi, Adoor Gopalakrishnan Baahubali 2, Veteran Director Baahubali 2, Baahubali 2 Comments, Director Slam Baahubali Makers, Baahubali 2 10 Rupees, 2 Cents Baahubali, Baahubali not Pride of Indian Cinema, Baahubali 2 Remake, Baahubali 2 Criticism

Adoor Gopalakrishnan slams Baahubali makers for spending crores of rupees. Fired Baahubali 2 for 'not contributing to Indian cinema'. Rajamouli remake Pathala Bhairavi as Baahubali.

బాహుబలిపై షాకింగ్ కామెంట్లు.. ఇండియాలో వరస్ట్ మూవీ

Posted: 06/06/2017 03:02 PM IST
Malayalam legendary director comments on baahubali

ఐదేళ్ల చిత్ర యూనిట్ కష్టం. అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విజువల్ ఎఫెక్ట్స్. భారీ సెట్ లు.. రాజమౌళి తీసిన‌ ‘బాహుబలి 2: ది కంక్లూజన్’పై యావ‌త్ ప్రపంచం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తుంది. అంతేకాదు ఈ స్ఫూర్తితోనే భారీ బడ్జెట్ సినిమాలు తీయ‌డానికి ఎంతో మంది ముందుకు వ‌స్తున్నారు కూడా. కానీ, ఈ సక్సెస్ ను ఇప్పటికీ కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఛాన్స్ దొరికితే చాలూ విరుచుకుపడుతున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు మరో లెజెండరీ డైరక్టర్ కూడా చేరాడు.

మాలీవుడ్ సీనియర్ దర్శకుడు, రైటర్ ఆదూర్ గోపాలకృష్ణన్ కి బాహుబలి ఏ మాత్రం నచ్చలేదంట. అందుకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. 75 ఏళ్ల ఆదూర్ ఓ ఛానెల్ నిర్వహించిన డిబెట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో మాట్లాడుతూ బాహుబలి కోసం తాను రూ. 10 కూడా ఖర్చుపెట్టనంటూ వ్యాఖ్యానించాడు. ‘‘అస‌లు ఈ సినిమాలో కథ ఏముంది?, దీని వల్ల రాజమౌళి సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చాడు. 1951లో తెలుగు, తమిళ్ భాషలో వచ్చిన ‘పాతాళ భైరవి’కి ఈ సినిమా కాపీ అంటూ చెప్పుకొచ్చాడు.

బాహుబలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాల వల్ల సమాజంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌న్న ఆయన, మూడు పూటల తిండి తినేందుకు జనాలు అవస్థలు పడుతుంటే కోట్ల రూపాయలను ఇలాంటి చెత్త సినిమాలపై ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డాడు. రూ. 10 కోట్లతో మనం 10 సినిమాలు నిర్మించ‌వ‌చ్చ‌ని, అలాంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇటువంటి వేస్ట్‌ సినిమాలు తీసి ఇండియన్ చలన చిత్ర పరిశ్రమ పరువు తీస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు. ఇంతకు ముందు బాహుబలి పార్ట్ 1కి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో కూడా ఈ సీనియర్ దర్శకుడు ఇలాంటి వ్యాఖ్యలే చేయటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Adoor Gopalakrishnan  Sensational Comments  

Other Articles