బాలీవుడ్ తోపాటు సౌత్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ విశాఖ సింగ్ కు ఊహించని షాక్ తగిలింది. ఫ్రాన్స్ లో కేన్స్ ఉత్సవాలకు వెళ్లిన ఈ 31 ఏళ్ల బ్యూటీ బ్యాగ్ దొంగతనంకు గురైంది. దీంతో ఆమె ఫ్రాన్స్ పోలీసులను, ఆపై ఇండియన్ ఎంబసీ సాయం తీసుకుంది.
తాను ఉంటున్న హోటల్ రూంలో బ్యాగ్ పెట్టి బయటికి వెళ్లి వచ్చేసరికి అందులోని విలువైన నగలు, పాస్ పోర్ట్ మిస్సయినట్లు ఆమె ఫిర్యాదు లో పేర్కొంది. అయితే ఫ్రాన్స్ పోలీసులు సకాలంలో స్పందించకపోవటంతో ఆమె భారత రాయబార కార్యాలయంను సంప్రదించిందంట. దీంతో వారు తాత్కాలిక పాస్ పోర్ట్ ఇచ్చి, ఆమెను ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. నేను సేప్ గానే ఉన్నానంటూ సోషల్ మీడియాలో కూడా ఆమె తెలిపింది.
2007లో జ్నాపకం అనే సినిమాతో ఆరంగ్రేటం చేసిన ఈ డస్కీ బ్యూటీ బాలీవుడ్ లో ఫక్రే సినిమాతో మంచి గుర్తింపు పొందింది. మూడేళ్ల క్రితం నారా రోహిత్ హీరోగా వచ్చిన రౌడీ ఫెల్లోలో విశాఖ సింగే హీరోయిన్. ప్రస్తుతం తురమ్, మాయా టేప్, ఫక్రే 2 చిత్రాలతో ఆమె బిజీగా ఉంది. ఇదిలా ఈ మధ్యే సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి అమెరికా ఎయిర్ పోర్ట్ లో ఇదే రీతిలో దోపిడీకి గురైన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more