NTR celebrates birthday with family members ఎన్టీఆర్ కు ఫస్ట్ బర్తడే విషెస్ చెప్పిన బడతడు..!

Ntr celebrates birthday with family members

ntr birthday celebrations, ntr with wife lakshmi pranathi, ntr son abhay ram, ntr fans, ntr twitter, ntr facbook, ntr photos, ntr latest photos, ntr latest news, ntr jai lavakusha, jr ntr, jr ntr birthday, happy birthday jr ntr, tarak, tarak birthday, jai lava kusa, jr ntr jai lava kusa, jai lava kusa first look

nandamuri young tiger NTR celebrates his birthday with family members, posts photos with his son and spouse on twitter with comments that he never forget this birthday which he celebrated with family

ఎన్టీఆర్ కు ఫస్ట్ బర్తడే విషెస్ చెప్పిన బుడతడు..!

Posted: 05/20/2017 10:25 AM IST
Ntr celebrates birthday with family members

ఎన్టీఆర్ బర్తడేను పురస్కరించుకుని ఆయన అభిమానులు అర్థరాత్రి పన్నెండు గంటల నుంచే అయనకు సామాజిక మాధ్యమాల ద్వారా బర్తడే విషెస్ చెబుతున్నారు. ఇక దీనికి తోడు ఆయన తాజా చిత్రం జై లవకుశ కూడా అభిమానులకు ఎన్టీయార్ 34వ బర్తే డే గిప్టును అందించింది. సినిమా ఫస్ట్ లుక్ ను అభిమానులతో పంచుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న అభిమానులు ఎన్టీయార్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపేందుకు ఆర్థరాత్రి నుంచి పోటీపడుతున్నారు.

అయితే ఆయనను కలుసుకుని నేరుగా ఫస్ట్ విషెస్ చెప్పింది మాత్రం ఈ బుడతడే. ఇంతకీ ఈ బడుతడు ఎవరు అంటారా..? ఆ మీకు తెలుసని మాకు అర్థమైంది. అవునండీ నందమూరు వారుసుడే. ఎన్టీయార్ గారాల పట్టి అభయ్. ఇవాళ వేకువజామునే లేచిన అభయ్ తన తండ్రి ఎన్టీఆర్ వద్దకెళ్లి ముందుగా బర్తడే విషెస్ తెలిపాడు. ఆ తరువాత ఆయన కుటుంబసభ్యులు కూడా విషెస్ చెప్పారు.

ఇవాళ (మే 20వ తేదీ) తన బర్త్ డే సందర్భంగా.. ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్ చేశారు ఎన్టీఆర్. ఉదయాన్నే తన కుటుంబసభ్యులు తనకు బర్తడే విషెస్ చెబుతుండగా తీసీన ఈ ఫోటోలను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భార్య, కుమారుడితో సరదాగా వున్న ఎన్టీఆర్ పోస్ట్ చేసిన చిత్రాలతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక తండ్రి ఎన్టీఆర్ భుజాలపైకి ఎక్కి ఆడుకుంటున్నాడు అభయ్.. ఎన్టీఆర్ కళ్లు మూస్తూ అల్లరి చేస్తున్నాడు చిన్నోడు. ఇక భార్యతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. నా జీవితం ఈ బర్త్ డే మరిచిపోలేనిది. చాలా హ్యాపీగా ఉన్నా అంటూ ఆనందం వ్యక్తం చేశాడు ఎన్టీఆర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Jai Lava Kusha  Lakshmi Pranathi  Abhay Ram  Birthday  tollywood  

Other Articles