Marati Producer Atul Tapkir Commits Suicide

Marathi film producer kills self

Marathi Film Producer, Marathi Producer Death, Dhol Taashe Pathak Producer, Marathi Producer , Atul Tapkir Suicide Note, Producer Wife Torture, Producer Death, Producer Suicide, Producer Poison, Producer, Pune Producer Death

Marathi Film Producer Atul Tapkir Allegedly Commits Suicide, blames wife in Facebook post.

భార్య వేధింపులతో నిర్మాత ఆత్మహత్య

Posted: 05/15/2017 10:10 AM IST
Marathi film producer kills self

భార్య వేధింపులు భరించలేక సినీ నిర్మాత ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరాఠీ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. అతుల్ తప్కిర్ అనే యంగ్ ప్రోడ్యూసర్ పుణే లోని ఓ హోటల్ లో పురుగుల మందు తాగి సూసైడ్ కి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే దీనికి కారణం అతని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా స్పష్టమైంది.

2013 లో మరాఠీలో వచ్చిన దోల్ తషే సినిమాకు అతుల్ నిర్మాతగా వ్యవహరించాడు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నప్పటికీ, భాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించలేకపోయింది. అయితే ఆ తర్వాత తన భార్య, ఆమె సోదరులు అతుల్ ను వేధించటం మొదలుపెట్టారంట. సూసైడ్ కు ముందు ఈ యంగ్ ప్రోడ్యూసర్ తన ఆవేదనను ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు.

‘‘మిత్రులకు నమస్కారం. నేను అతుల్ తాప్‌కీర్. ఇటీవల ‘డోల్ తషే’ అనే సినిమాను నిర్మించా. అందులో వచ్చిన నష్టాలు నన్ను కుంగదీశాయి. ఈ సినిమా నాకు స్ఫూర్తినిచ్చినా ఆర్థికంగా మాత్రం కుంగిపోయా. ఇదే విషయం నాన్న, అక్కయ్యలకు చెబితే వారు కొంత సాయం చేశారు. కానీ నా భార్య ప్రియాంక మాత్రం నన్ను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టింది. నన్నే కాదు.. నా తండ్రిని కూడా..’ అని అతుల్ పేర్కొన్నారు. భార్య వేధింపులు భరించలేకే తనువు చాలిస్తున్నట్టు తెలిపారు. ఆత్మహత్య అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కేసును మాత్రం యాక్సిడెంటల్ డెత్ గా నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Marathi Producer  Wife Torture  Suicide  

Other Articles