Ramya Krishna opens up on Casting Couch

Ramya krishna make adjustment comments on tollywood

Ramya Krishna, Ramya Krishna Casting Couch, Ramya Krishna Adjustment, Ramya Krishna Tollywood, Ramya Krishna Sensational Comments, Ramya Krishna Comments, Ramya Krishna Tollywood, Tollywood Senior Actress Casting Couch Comments

Actress Ramya Krishna opens up on Tollywood Casting Couch. Suggest Actresses to Adjust if survive in carrier.

టాలీవుడ్ లో సర్దుకుపోవాల్సిందే: రమ్యకృష్ణ

Posted: 05/10/2017 04:06 PM IST
Ramya krishna make adjustment comments on tollywood

టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మాట కాస్టింగ్ కౌచ్. సీనియర్ హీరోయిన్లతోసహా చాలా మంది ఇప్పటికే దీనిపై చాలా చాలా ఓపెన్ గా కామెంట్లు చేసేశారు. భావన లైంగిక వేధింపులు వెలుగు చూశాక ఇండస్ట్రీలో ఉన్న చెండాలం అంతా ఒక్కోక్కటిగా వెలుగు చూస్తోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్లతో సహా అంతా వీటికి గురైన వారే.

వీరిలో ఇప్పుడు మరో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా జాయిన్ అయ్యింది. రంగుల ప్రపంచంలో పైకి రావాలంటే ఎన్నో రకాలైన వేధింపులు ఎదుర్కోవాల్సిందేనని కుండ బద్ధలు కొట్టేసింది. ఇది ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు.. అన్నింటా ఉన్నదేనని... మహిళలు పైకి ఎదగాలంటే చాలా విషయాల్లో సర్దుకుపోవడం తప్పదన్నది ఆమె మాట. అయితే ఎలా సర్దుకుపోవాలి... ఎంతవరకు సర్దుకుపోవాలన్నది వారిష్టం మీద ఆదారపడి ఉంటుందని సూచిస్తోంది.

ఇటీవల ఇండస్ట్రీలో బాగా డిస్కషన్ లో ఉన్న పాయింట్ పై శివగామిగా దేశం మొత్తం పాపులర్ అయిన రమ్యకృష్ణ మాట్లాడేయటం చర్చనీయాంశంగా మారింది. చాలా కామన్ అయిన కాస్టింగ్ కౌచ్ విషయంలో పరిధిలు దాటకుండా ఎవరి లైఫ్ కి తగ్గట్లు వారు నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, ఇతరులను విమర్శించటం ద్వారా సాధించేది ఏం లేదన్నది రమ్యకృష్ణ చెబుతున్న వర్షన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Ramya Krishna  Casting Couch Comments  

Other Articles