katrina Kaif Fan Attacked by Her Car Driver

Katrina kaif s driver allegedly slaps fan

Katrina Kaif, Katrina Kaif Fan, Katrina Kaif Fan Attack, Katrina Kaif Name Shout, Katrina Kaif Fan Selfie, Katrina Kaif Car Driver, Katrina Car Driver, Katrina Kaif Fan Attack

Katrina Kaif's Driver Allegedly Slaps Fan who was screaming her name. Fan who was shouting her name and insisting on a selfie with Kat.

అభిమానిపై కత్రినా డ్రైవర్ దాడి

Posted: 05/09/2017 11:18 AM IST
Katrina kaif s driver allegedly slaps fan

బాలీవుడ్ సెక్సీ క్వీన్ కత్రినా కైఫ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. 14 ఏళ్ల ప్రాయంలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సల్మాన్ సాయంతో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ మధ్య పెద్దగా హిట్లు లేకపోయినా నెక్స్ట్ ప్రాజెక్టులు జస్సా జగ్గూస్, సల్మాన్ టైగర్ జిందా హై... లాంటి క్రేజీయెస్ట్ చిత్రాల్లో నటిస్తోంది.

ఇదిలా ఉంటే అభిమానుల పట్ల స్టార్ల వైఖరి ఎలా ఉంటుందోనన్న ఉదంతం మళ్లీ బయటపడింది. గత శనివారం రాత్రి కత్రినా తన కారులో ఇంటికి వెళ్తుండగా ఓ అభిమాని ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె నివసించే ఫ్లాట్ దగ్గరికి రాగానే బయటి నుంచే కత్రినా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఒక్క సెల్ఫీ అంటూ బతిమాలటం మొదలుపెట్టాడు. అయితే కత్రినా కాకుండా ఆమె డ్రైవర్ వెంటనే రియాక్ట్ అయ్యాడు.

నేరుగా వచ్చి ఆ వీరాభిమాని ముఖంపై పిడిగుద్దు గుద్దాడు. దీంతో షాక్ తిన్న అభిమాని...ఏడుస్తూ వెనుదిరిగాడు. అయితే ఈ వ్యవహారంలో కత్రినా తప్పేం లేదని కొందరు చెబుతున్నారు. సెలబ్రిటీలు అంటే పబ్లిక్ ఫిగర్ లే తప్ప.. పబ్లిక్ ప్రాపరిటీలు కాదని అంటున్నారు. ఈ మధ్యే నటి దిశా పఠానికి ఓ అభిమాని చేసిన పనితో వణుకు పుట్టగా ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif  Car Driver  Fan  Attack  

Other Articles