Anchor Suma Bad Joke on Babu Baga Busy Actress

Anchor suma apology to heroine

Anchor Suma, Suma Babu Baga Busy Interview, Babu Baga Busy Interview, Mishti Chakraborty Anchor Suma, Anchor Suma Cross Limits, Anchor Suma Interview, Anchor Suma Bad Joke, Anchor Suma Satire, Suma Bad, Suma Babu Baga Busy Funny

Anchor Suma Satire on Babu Baga Busy Heroine Mishti Chakraborty. Later she apologized asked her technicians to chop out that bit.

హీరోయిన్ కు సారీ చెప్పిన యాంకర్ సుమ

Posted: 05/04/2017 02:55 PM IST
Anchor suma apology to heroine

సరైన టైమింగ్, పంచ్ డైలాగులు.. హిల్లేరియస్ జోకులు... ఇవన్నీ చెప్పగానే టక్కున గుర్తొచ్చే రూపం యాంకర్ సుమ. తెలుగమ్మాయి కాకపోయినా మనోళ్ల కంటే సుమ నోటి నుంచి జాలువారే పదాలే ఎంతో తియ్యగా ఉంటుంటాయి. అందుకే తెలుగులో జరిగే భారీ ఈవెంట్లకు, ఇంటర్వ్యూలకు దాదాపు ఈ క్రేజీ యాంకర్ నే తీసేసుకుంటుంటారు. అయితే రీసెంట్ గా జరిగిన ఓ వ్యవహారం మాత్రం సుమ ఆటిట్యూడ్ ను విమర్శించేలా ఉంది.

బాబు బాగా బిజీ సినిమా ప్రమోషన్ లో బాగంగా ఓ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని స్వయంగా తానే నిర్మాతగా మారి ఏర్పాటు చేసిన సుమ హీరోయిన్ పై వేసిన జోక్ అంతటికి కారణం. ఈ సినిమాలో బెంగాలీ భామ మిస్తీ చక్రవర్తి ఓ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మాటల మధ్యలో సుమ మిస్తీ బదులు ఆర్ యూ ముష్టి?( అంటూ ఓ ప్రశ్నను సంధించింది. అంతే అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేశారు. అదేంటో అర్థం కాకపోయినప్పటికీ మిస్తీ కూడా వాళ్లతోపాటే శృతి కలిపేసింది.

అయితే చివరకు తన లిమిట్స్ క్రాస్ చేశానని అర్థం చేసుకున్న సుమ మిస్తీకి క్షమాపణలు కూడా చెప్పి, ఆ బిట్ ను తీసేయాల్సిందిగా టెక్నీషియన్స్ కు సూచించిందంట. స్వేచ్ఛ తీసుకుని ఇలాంటి జోకులు వేయటం కామన్ అయినప్పికీ , వెనకాల విమర్శించేవారు కూడా ఉంటారన్నది సుమ గ్రహించి ఇకనైనా జాగ్రత్తగా ఉంటే మంచిందని కొందరు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Suma  Babu Baga Busy Interview  Mishti Chakraborty  Bad Joke  

Other Articles