Baahubali team faced racism in at Dubai Airport.

Shobu yarlagadda accuses emirates of racism

Baahubali 2, Baahubali 2 Racism, Baahubali Producer, Shobu Yarlagadda Racism, Shobu Yarlagadda Twitter, Baahubali 2 Team Insult, Baahubali 2 Dubai, Baahubali Team Dubai, Emirates Baahubali Team, Shobu Yarlagadda Insult

Baahubali 2 team harassed at Dubai. Prabhas and team face racism in Airport. Producer Shobu Yarlagadda reveals what exactly .what happend.

బాహుబలి టీంపై జాతి వివక్షత

Posted: 04/26/2017 02:30 PM IST
Shobu yarlagadda accuses emirates of racism

బాహుబలి చిత్ర యూనిట్ కి జాతి వివక్షత ఎదురైంది. తమకు జరిగిన ఘోర అవమానం గురించి నిర్మాత శోభు తన ట్విట్టర్ లో తెలియజేశాడు. ఎమిరేట్స్‌ ఈకే526 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన బాహుబ‌లి టీమ్‌తో గేట్ వ‌ద్ద ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆ చిత్రం నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.

త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ విష‌యం గురించి వివ‌రించారు. బాహుబలి పబ్లిసిటీ కార్యక్రమం కోసం ప్రభాస్‌, అనుష్క, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు ప‌లువురు దుబాయ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎయిర్ లైన్స్ సిబ్బంది త‌మ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన సిబ్బంది త‌మ‌పై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు కూడా తన‌కు అనిపించిందని చెప్పారు. తాను తరచూ ఎమిరేట్స్‌ విమానంలో ప్రయాణిస్తుంటాను కానీ, త‌నకు ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని ఆయ‌న ట్వీటాడు.

కాగా, దీనిపై దీనిపై ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ స్పందించింది. మీకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. బుకింగ్ ఐడీ పంపితే ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపడతామని తెలిపింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali Team  Racism  Dubai Airport  Shobu Yarlagadda  

Other Articles