Anjali quit horror stories due to Real Ghost

Anjali good bye to ghost stories

Anjali, Anjali Horror Movies, Anjali Real Ghosts, No Ghost Stories Anjali, Anjali House Vacate, Actress Anjali Ghost Troubles, Anjali Paranormal Activity, Anjali Real Ghost

Anjali Decided to Quit Horror Zoner Films. She had experienced some paranormal activity in the Gachibowli apartment where she resided.

ఘోస్ట్ సినిమాలకు అంజలి గుడ్ బై

Posted: 04/26/2017 03:41 PM IST
Anjali good bye to ghost stories

అప్పుడెప్పుడో చంద్రముఖి సినిమా చేసిన తర్వాత రజనీకాంత్ కు బ్యాడ్ టైం నడవటం చూశాం. ఏవో దుష్టశక్తులు ఆయన్ని వెంబడించటంతోపాటు ఆరోగ్యపరంగా కూడా ఆయన్ని దారుణంగా దెబ్బతీసిందని చెప్పుకున్నారు. అంతేకాదు వాటిని నమ్మే రజనీ కూడా తర్వాత రెండో సిరీస్ నుంచి తప్పుకుని అటువంటి జోనర్ సినిమాల జోలికి పోకూడదని డిసైడ్ అయిపోయాడు.

ఇక ఇప్పుడు సేమ్ టూ సేమ్ ఇలాంటిదే నటి అంజలి విషయంలో జరిగింది. గీతాంజలి, చిత్రాంగద అంటూ వరుసగా దెయ్యాలు తీసిన సీతమ్మకు ఈ మధ్య దెయ్యాల భయం పట్టుకుందంట. గచ్చిబౌలి లో ఉంటున్న తన ఫ్లాట్ లో ఏవో దుష్ట శక్తులు తిరుగుతున్నాయని, రాత్రి పూట విచిత్ర శబ్ధాలు వస్తున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

అంతే దెబ్బకు ఫ్లాట్ ఖాళీ చేసిన అంజలి మరో ఏరియాలో ఇల్లు తీసుకునే పనిలో ఉందంట. అంతేకాదు ఈ మధ్యే ఓ రెండు హర్రర్ స్టోరీలు డిస్కషన్ కు వస్తే ఇక పై ఆ జోనర్ సినిమాల జోలికి పోనని తెగేసి చెప్పేసిందంట. అంటే ఇకపై అంజలిని అలాంటి రోల్స్ లో చూడలేమన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Anjali  Ghost Stories  

Other Articles