Baahubali 2 Expected Grand Opening In Bollywood too.

Baahubali 2 big target in bollywood

Baahubali 2, Baahubali 2 Bollywood, Baahubali 2 Dangal, Baahubali 2 Weekend Collections, Baahubali 2 Bollywood Target, Baahubali 2 Bollywood Weekend Collections, Baahubali 2 Dangal Sultan, Bollywood Trade Baahubali 2

Baahubali 2 set big target in Bollywood. Bollywood trade pundits expecting ‘Baahubali 2’will beat Aamir Khan’s ‘Dangal’ first day collections and first Sunday collections.

బాహుబలి-2 .. బాలీవుడ్ వీకెండ్ కలెక్షన్లే టార్గెట్

Posted: 04/25/2017 06:06 PM IST
Baahubali 2 big target in bollywood

బాహుబలి ది కంక్లూజన్ మరో మూడు రోజుల టైం మాత్రమే ఉంది. ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలతో బిజీగా గడిపేస్తున్నారు. ఇక్కడ తంతు ముగియటంతో విదేశాలకు ఎగిరిపోతుంది చిత్ర యూనిట్. దేశంలో ఇంత వరకు ఏ హీరో కూడా ఇలా ధైర్యం చేసి ఐదేళ్లు ఒకే సినిమాపై గడపలేదని, తనపై ఉంచుకున్న నమ్మకానికి ప్రభాస్ కు రుణపడి ఉంటానని ఉద్వేగపూరితంగా చెబుతున్నాడు
రాజమౌళి.

అంతేకాదు హీరోల్లో ప్రభాస్ డార్లింగ్ గా మారడానికి కూడా అతని ఆటిట్యూడే కారణమని, అంతా అది సిగ్గు అనుకుంటారని, కానీ, అబద్ధాలు, చాడీలు చెప్పటం కన్నా సైలెంట్ గా ఉండటమే మంచిదని భావించే ప్రభాస్ అందుకే అందరి వాడు అయ్యాడని ప్రభాస్ లో మనకు కోణం గురించి రివీల్ చేశాడు. సినిమా రిలీజ్ అవుతుంటే టెన్షన్ పెరిగిపోతుందని తెలిపాడు.

ఇక బాహుబలి మెయిన్ టార్గెట్ బాలీవుడ్ కలెక్షన్లేనని చెప్పకనే చెప్పాడు జక్కన్న. ఇప్పటిదాకా ఫస్ట్ డే బాలీవుడ్ లో వీకెండ్ కలెక్షన్లు సాధించిన సినిమాలకు ధీటుగా ఒక తెలుగు చిత్రం కూడా సాధిస్తే అది గర్వకారణంగా ఫీలవుతానని అంటున్నాడు. దంగల్ అన్ని భాషల్లో కలుపుకుని వీకెండ్ 42 కోట్లు, తర్వాతి స్థానంలో సల్మాన్ సుల్తాన్ ఉంది. ఇక ఇప్పుడు బాహుబలి 2 ఓ నేషనల్ ప్రాజెక్టు. పైగా 9000 థియేటర్లలో చరిత్రలో కనివిని ఎరగని రీతిలో రిలీజ్ అవుతోంది. ఆ విషయంలో అంతకు మించే ఏదో జరగబోతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అదే జరిగితే ఒక తెలుగు సినిమా ఇండియన్ చరిత్రలో కొత్త అధ్యయనం లిఖించినట్లే అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Bollywood  Weekend Collections  

Other Articles