Ram Gopal Varma tweets on Baahubali 2 | బాహుబలి-2.. వర్మ అసలు భయం అదేనంట!

Rgv again tweet on baahubali 2

Ram Gopal Varma, RGV Baahubali 2, Ram Gopal Varma Rajamouli, SS Rajamouli Baahubali 2, Baahubali 2 RGV Fear, RGV Kamal Tweets, RGV Beauty Ugly Tweets, Ram Gopal Varma Tweets

Director Ram Gopal Varma tweets on Baahubali 2 and Rajamouli, Bahubali2 will make rest of all film makers in country feel like amateur TV serial directors he added.

బాహుబలి- 2 పై వర్మ మళ్లీ ట్వీట్

Posted: 04/25/2017 12:02 PM IST
Rgv again tweet on baahubali 2

ఆగ్రహాం వస్తే ఎంతటి దారుణమైన ట్వీట్ తో తాటతీస్తాడో.. అభిమానం కూడా అదే రేంజ్ లో చూపించటం వర్మ స్టైల్. అందుకే బాహుబలి విషయంలో బాగా ఎగ్జయిట్ అవుతూ రాజమౌళిని తెగ పొగిడేస్తున్నాడు. మరీ మధ్యలో ఎవరైనా అక్కుపక్షిలా విసిగిస్తే ఊరుకుంటాడా? అందుకే తమపై జోకేసిన కమల్ రషీద్ ఖాన్ ను ఏకేశాడు.

ఇద్దరూ అగ్లీగానే ఉంటారు. 2 రుపీస్ పీపుల్.. ఎంజాయ్ చేయండి" అంటూ కమల్ ట్వీటేస్తే.. రాజమౌళి నన్ను ఒగ్గేయ్యండయా అంటే. వర్మ మాత్రం మాంచి సెటైర్ వేసి పడేశాడు. "బాగా చెప్పారు.. అందరూ మీ లాగా.. షారూక్ లాగా అందంగా ఉండరు కదా" అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అంతటితో ఆగితే వర్మ ఎందుకు అవుతాడు? అందుకే బ్యూటీ అగ్లీ.. ఈ రెండు పదాలను ఉపయోగిస్తూ.. సుదీర్ఘమైన ట్వీట్ పెట్టి కన్ఫ్యూజ్ పారేశాడు. తన ఇంగ్లీష్ పాండిత్యం ప్రదర్శించి.. అగ్లీ బ్యూటీ పదాలతో ఆడుకుంటూ వర్మ పెట్టిన ట్వీట్ కి.. తిరిగి సమాధానం కమల్ ఖాన్ నుంచి రాలేదు.

ఇక రిలీజ్ మూడు రోజుల్లో విడుదల కానున్న వేళ, దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఈ ఉదయం మరో ట్వీటేశాడు. బాహుబలి-2వ భాగం విడుదలైన తరువాత, దేశంలోని చిత్ర నిర్మాతలు, దర్శకులందరూ తామంతా టీవీ సీరియల్ నిర్మాతలము, దర్శకులమేనని భావించాల్సి వస్తుందని అన్నాడు. ఈ విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెబుతూ జక్కనపై ప్రేమను కురిపించేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma Tweets  Baahubali 2  Rajamouli  

Other Articles