గుండుతో సోనూ నిగమ్.. ఇస్లాం వ్యతిరేక కామెంట్లపై ఎమోషనల్ వివరణ | Sonu Nigam emotional explanation on Azaan tweets.

Sonu nigam clarifies on his controversial tweet over azaan

Sonu Nigam, Sonu Nigam Controversial Tweets, Sonu Nigam Azaan Tweets, Azaan Sonu Nigam, Sonu Nigam Sonu Sood, Sonu Nigam, SInger Sonu Nigam Tweets, Singer Sonu Nigam Press Meet, Sonu Nigam Shave Head, Sonu Nigam Fatwa , Sonu Nigam Anti Islam Comments

Sonu Nigam shaves head on live television and addressed press conference over Azaan issue. Raised a social topic and not a religious one when he tweeted about being woken up by the sound of azaan, the Muslim call to prayers, and apologised “if someone thought otherwise” he concluded.

మతపరమైన విమర్శలపై సోనూ నిగమ్ వివరణ

Posted: 04/19/2017 03:16 PM IST
Sonu nigam clarifies on his controversial tweet over azaan

మత పరమైన కామెంట్లు చేసి సింగర్ సోనూ నిగమ్ విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. అయితే తాను ఓ సామాజిక అంశంపై మాత్రమే స్పందించానని, మతాన్ని కించపరిచేలా ఎక్కడా ట్వీట్లు చేయలేదని సోనూ ప్రెస్ మీట్ లో తెలిపాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మత ప్రవక్త ఈ టాప్ సింగర్ పై ఫత్వా జారీ చేయటంతోపాటు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా సోనూ గుండుతో ప్రెస్ మీట్ లో కనిపించటం విశేషం.

మసీదుల్లో మైక్ ద్వారా ప్రార్థన పిలుపు(ఆజాన్స్) కు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. మతపెద్దలు అయితే ఏకంగా అతనిపై ఆగ్రహాం వ్యక్తం చేసారు కూడా. కోల్ కతాకు చెందిన ఓ మత గురువు సోనూకు గుండు గీకి, చెప్పుల దండ వేసి దేశ మంతా ఊరేగిస్తే 10 లక్షలు ఇస్తానని ప్రకటించాడు కూడా.

 

 

 

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటే తానేం చేయలేనని ఈ గాయకుడు చెబుతున్నాడు. తాను కేవలం ఒక్క మసీదులనే టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయలేదని, గుళ్లు, గురుద్వారాలు కూడా ఇదే రీతిలో ఉన్నాయని, ఆయా మతాల పెద్దలు ఉన్న బతికి ఉన్న సమయంలో కూడా కరెంట్ లేదన్న విషయం వాళ్లకి తెలీదా? అంటూ సెటైరిక్ గా అందులో పేర్కొన్నాడు. కాగా, ఆజాన్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు కన్ఫ్యూజన్ లో సోనూ నిగమ్ బదులు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ను తిట్టి పోయటం చూశాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonu Nigam  Anti Islam Comments  Press Meet  

Other Articles