లైట్ మెన్ ను మణిరత్నం ఎంత దారుణంగా మోసం చేశాడంటే... 20 వేలు లంచం అడిగారా? | Mani Ratnam cheated Guru light man.

Maniratnam threatened with hunger strike and suicide

Mani Ratnam, Mani Ratnam Guru, Mani Ratnam Light Man Controversy, Light man Threaten Star Director, Light man Suicide, Kollywood Light Man, Mani Ratnam Hunger Strike, Light Man Suicide Threat, Mani Ratnam Cheated

One light man Manimaaran who worked for Mani Ratnam’s ‘Guru’ in 2006 is presently on a hunger strike demanding Mani Ratnam to pay compensation for him for his medical expenses which have been incurring on him.Responding on this issue, Mani Ratnam’s team is asking how a production house is responsible for the health condition of hundreds of workers and how can Mani Ratnam know the health condition of all those who work with him. They see it as someone’s ploy to spoil the director’s name.

మణిరత్నంకు లైట్ మెన్ సూసైడ్ వార్నింగ్

Posted: 04/18/2017 08:33 AM IST
Maniratnam threatened with hunger strike and suicide

క్లాసిక్ చిత్రాల దర్శకుడు మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని సినిమా లైట్‌ మ్యాన్‌ ఒకరు బెదిరించడం కోలీవుడ్‌ లో కలకలం రేపుతోంది. 2006 లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంటగా మణిరత్నం 'గురు' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లైట్ మ్యాన్ గా పని చేసిన మణిమారన్ అనే వ్యక్తి నిరాహార దీక్షకు దిగాడు.

గురు షూటింగ్ సమయంలో మణిమారన్ రక్తసంబంధ వ్యాధికి గురయ్యాడు. అయితే తన వైద్య ఖర్చులకు లైట్‌ మ్యాన్‌ సంఘం, మణిరత్నం, 'గురు' చిత్ర యూనిట్‌ ఎలాంటి సహాయం చేయలేదని, పదేళ్లుగా తన కుటుంబ సభ్యులే తన వైద్య ఖర్చులు భరిస్తున్నారని, తనకు రావాల్సిన డబ్బు ఇప్పించలేకపోతే మణిరత్నం నివాసం ముందే ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరిస్తున్నాడు. దీనిపై తన లైట్‌ మ్యాన్‌ సంఘంపై కోర్టులో పోరాడి విజయం సాధించినా తనకు రావాల్సిన 2 లక్షల రూపాయలు చెల్లించలేదని వాపోయాడు., దీని గురించి అడిగితే సంఘ కార్యదర్శి రామన్‌ 20 వేల రూపాయలు లంచం అడుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆరోపణలపై మణిరత్నం పర్సనల్ స్టాఫ్ స్పందించారు. ఒక సినిమా కోసం వందల మంది టెక్నిషియన్లు పని చేస్తారని, అలాంటప్పుడు వారందరి ఆరోగ్య స్థితిగతుల గురించి మణికి ఎలా తెలుస్తుందని, అయినా ప్రోడక్షన్ దానికి ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఈ స్టార్ దర్శకుడి పేరు చెడగొట్టేందుకే ఇలాంటి వివాదంలోకి లాగుతున్నారని వారంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam  Guru Movie  Light Man  Hunger Strike  

Other Articles