మాథ్స్ మేధావి బయోపిక్ లో బాలయ్య?? | Balayya to invoke another Telugu legend.

Nbk reprise telugu legendary personality

Bala Krishna, Telugu legend Biopic, Bala Krishna Legendary Biopic, Balayya Sastry Garu, Sastry Biopic Balayya, Bala Krishna as Mathematician, Sastry Garu Movie

Tollywood senior hero Bala Krishna is said to have inspired by a Telugu legend and is set to reprise him on screen. During his recent visit to Deutsches Historical Museum (a famous German Historical Museum), Balayya has been surprised after he found a sculpture of a Telugu legendary mathematician Sastry garu. His sculpture has been placed between world’s legendary leaders like Hitler and Lenin after which Balakrishna starting enquiring about him. With some gathered information, he got to know that Sastry garu influenced German economists during his time and he decided to reprise his role. Couple of young writers are currently working on his story and we have to wait and see if the script impresses Balayya to be made into a movie.

లెజెండరీ బయోపిక్ లో బాలయ్య??

Posted: 04/11/2017 12:47 PM IST
Nbk reprise telugu legendary personality

వందో చిత్రం శాతకర్ణి రిలీజ్ అయ్యి వంద రోజులు ఇలా అయ్యిందో లేదో వేగం పెంచిన బాలకృష్ణ పూరీ సినిమాను అంతే జెట్ స్పీడ్ తో కానిచ్చేస్తున్నాడు. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ ను కానిచ్చేసి ఆ వెంటనే మరో సినిమాను కమిట్ అవ్వాలని చూస్తున్నాడు. అయితే ఆ స్పీడ్ లో దేనికి పడితే దానికి ఒకే చెప్పకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

తండ్రి బయోపిక్ వచ్చే ఏడాది ఉంటుందని అల్రెడీ అనౌన్స్ చేయటంతో ఈ గ్యాప్ లో ఖాళీగానే ఉంటాడా? అన్న డౌట్లు మొదలయ్యాయి. కానీ, తమిళ దర్శకుడు రవికుమార్ చిత్రం రెడ్డిగారు ఇంకా ఫైనలైజ్ కాకపోవటంతో ఆ ప్లేస్ లో మరో క్రేజీ ప్రాజెక్టు వచ్చి చేరే అవకాశం ఉందన్న టాక్ ఇప్పుడు నడుస్తోంది. రీసెంట్ గా బాలయ్య డచ్చెస్ హిస్టారికల్ మ్యూజియమ్ ను సందర్శించాడు. అందులో జర్మనీకి చెందిన పలువురు ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.

అయితే వాటిల్లో భారత్ కు చెందిన గణిత వేత్త శాస్త్రి ప్రతిమ ఉండటం బాలయ్యను షాక్ కి గురిచేసిందంట. లెనిన్, హిట్లర్ లాంటి నేతల మధ్య శాస్త్రి గారి విగ్రహాం ఉండటంతో వెంటనే ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బాలయ్య అడిగి తెలుసుకున్నాడంట. జర్మనీ ఆర్థిక వేత్తల నుంచి ప్రేరణ పొంది శాస్త్రి గణిత మేధావిగా ఎదిగాడు. అందుకే ఆ బయోపిక్ కు సంబంధించిన కథా బాధ్యతలను యువ రచయితలకు అప్పజెప్పినట్లు భోగట్టా. అంతా అనుకున్నట్లు జరిగి స్క్రిప్ట్త్ తో మెప్పించగలిగితే మరో బయోపిక్ లో బాలయ్య నటించడం ఖాయమనే అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Krishna  Legendary Mathematician  Sastry Garu  Biopic  

Other Articles