దక్షిణ రాష్ట్రాల్లో ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్ పట్టణాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే వాటిని సాకుగా చేసుకుని వెకేషన్లు ఎంజాయ్ చేయాలన్న మూడ్ లో మన హీరోలు మాత్రం లేరనే చెప్పాలి. 40 ఢిగ్రీల పై బడ్డ హీట్ ను సైతం లెక్క చేయకుండా ఎలాగైనా హిట్లు అందించి తమ అభిమానులను అలరించాలనే తెగ కష్టపడిపోతున్నారు. సుమారు 10 నుంచి 12 గంటలపాటు షూటింగ్ లలో నిర్విరామంగా పాల్గొంటున్నారు.
సీనియర్ హీరోలైన బాలయ్య, నాగ్ లు ప్రస్తుతం వేసవిలో ఖాళీగా లేరు. బాలయ్య పూరీ, నాగ్ ఓంకార్ రాజుగారి గది-2 లో బిజీగా ఉన్నారు. చిరు, వెంకీలు మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రస్తుతం హైదారాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 12-14 గంటలపాటు పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. అఫ్ కోర్స్ పవన్ కష్టానికి తగ్గట్లే రెమ్యునరేషన్ కూడా ఉండొచ్చనే అనుకోవాలి.
ఇక అబ్బాయి రాంచరణ్ రాజమండ్రి లో సుకుమార్ షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. అక్కడ కూడా వేడి గాలులు భీభత్సంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యం అవ్వటం మూలంగానే రెస్ట్ లేకుండా సినిమా కంప్లీట్ చేయాలని చెర్రీ భావిస్తున్నాడు.
బ్రహ్మోత్సవంతో భారీ డిజాస్టర్ అందించిన మహేష్ బాబు మురగదాస్ సినిమా కోసం 24/7 కష్టపడుతున్నాడు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం తర్వాత హైదారాబాద్ కి షిఫ్ట్ కానుంది. నాన్ స్టాప్ గా షెడ్యూల్ లో పాల్గొంటూ ఈ నెలాఖరుకల్లా సినిమా పూర్తి చేసే ఫ్లాన్ లో మహేష్ ఉన్నాడు.
ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్ లది ఇదే పరిస్థితి. హైదారాబాద్ మండుటెండల్లోనే ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాల షూటింగ్ ల కోసం కష్టపడుతున్నారు. దాదాపు అన్ని చిత్రాల అవుట్ డోర్ షూటింగ్ అయినప్పటికీ బ్రేక్ తీసుకునే ఆలోచనలో మాత్రం వీళ్లెవ్వరూ లేరు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more