30 నిమిషాల కోసం 120 రోజులు.. | Baahubali 2 war episodes details.

Rajamouli about baahubali 2 war scenes

Baahubali 2, Baahubali 2 War Episodes, Baahubali 2 Shooting, Baahubali 2 On location, Baahubali 2 details. Rajamouli Baahubali Crew

Baahubali 2 war episodes shot for 120 days without breaks.

బాహుబలి-2 వార్ ఎపిసోడ్ల కష్టంపై రాజమౌళి

Posted: 04/10/2017 04:44 PM IST
Rajamouli about baahubali 2 war scenes

కేవలం ఐదేళ్లు ఒకే ప్రాజెక్టుపై పని చేయటం అంటే అందుకు ఎంతో ఓపిక అవసరం. కానీ, రాజమౌళి లాంటి దర్శకులకు కసితో మాత్రమే పని. మొదటి పార్ట్ రిలీజ్ సమయంలో కొన్ని విమర్శలు వినిపించటంతో రెండో పార్ట్ లో తన మార్క్ మసాలాను మిస్ చేయకూడదని డిసైడ్ అయి మూడేళ్ల కంటే ఈ రెండేళ్లలోనే ఎంతో కష్టపడ్డాడు. ఫలితం మరో 18 రోజుల్లో తేలిపోనుంది.

బిగినింగ్ లో కేవలం పాత్రలను మాత్రమే ఇంట్రడ్యూస్ చేశానని, అసలు ఎమోషన్ డ్రామా అంతా కంక్లూజన్ లోనే ఉంటుందని తేల్చేసిన జక్కన్న శివగామి-దేవసేన ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ అవుతాయని అంటున్నాడు. అదే సమయంలో యుద్ధ సీన్ల కోసం చిత్ర యూనిట్ పడ్డ కష్టం చెప్పుకొచ్చాడు. నాలుగు నెలలపాటు నాన్ స్టాప్ గా వాటిని చిత్రీకరించినట్లు వివరించాడు.

సుమారు 120 రోజులపాటు ఆదివారాలు అన్న తేడా లేకుండా పని చేశాం. రేపటి కోసం ముందు రోజు 2-3 గంటలపాటు కసరత్తు చేసుకునే వాళ్లం. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా కఠోర శ్రమ లో మునిగిపోయే వాళ్లం. అందుకు మంచి ఫలితం అందుకుంటామన్న ఆశ నాకుంది అంటూ చెప్పుకొచ్చాడు జక్కన్న.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  War Episodes  Rajamouli  

Other Articles