ఈ హీరో చేయబోతున్న పనేంటో తెలిస్తే మతి పోవాల్సిందే! | vijay sethupathi shocks kollywood stars.

Vijay sethupathi gifts gold coins to seniors

Vijay Sethupathi , Vijay Sethupathi Gold, Vijay Sethupathi Gold Coins, Vijay Sethupathi Gift, Vijay Sethupathi Kollywood, Vijay Sethupathi 100 Years of Indian Cinema, Vijay Sethupathi, Ulagayutha Foundation event, Vijay Sethupathi Ulagayutha Foundation

Kollywood Hero Vijay Sethupathi gifts gold coins to senior technicians in kollywood on occasion of 100 years of Indian Cinema. Ulagayutha Foundation organising this event.

గోల్డ్ గిఫ్ట్ ఇచ్చేస్తున్న విజయ్ సేతుపతి

Posted: 04/10/2017 10:21 AM IST
Vijay sethupathi gifts gold coins to seniors

కోలీవుడ్ లో విజయ్ సేతుపతి అనే పేరు ఓ సెన్సేషన్. ఎందుకంటే ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో వరుస బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు కాబట్టి. ఎలాగంటే అచ్చం మన దగ్గర నానిలా అన్న మాట. అయితే కమర్షియల్ అన్న ఎలిమెంటే కాకుండా ప్రయోగాత్మక కథలతో కూడా హిట్లు కొట్టడం ఒక్క విజయ్ కే సాధ్యమయ్యింది. అంతేకాదు మరో విషయంలో కూడా నానితో ఇతగాడికి పోలిక ఉంది. తోటి స్టార్ల ఈవెంట్లకు, ఫంక్షన్లకు హాజరవుతూనే, సినిమా రాజకీయాలకు దూరంగా ఉంటూ అందరి వాడిగా ఆదరణ పొందుతున్నాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో చేయని ఓ పని చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు.

భారతీయ సినిమా శతాబ్ధి వేడుకల సందర్భంగా బంగారు నాణేలు పంచేందుకు సిద్ధమైపోయాడు. ఉలగాయుదా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఈ వేడుకలో ఎంపిక చేసిన వంద మంది సీనియర్‌ సినీ కళాకారులకు విజయ్‌ తలా ఒక కాసు బంగారం కానుకగా అందించేందుకు ముందుకు వచ్చాడు. కళామతల్లి తనకు చాలా చేసిందని, అందుకు ప్రతిఫలంగా ఏదైనా చేయడం తన కనీస బాధ్యతగా చెబుతున్నాడు. 2007లో బైసెల్‌ సంస్థతో కలిసి జీవీ.ఫిలింస్‌ సహకారంతో 75 మంది సీనియర్‌ సినీ కళాకారులకు కాసు బంగారంతో కూడిన పతకాలను కానుకగా అందజేసింది ఉలగాయుదా ఫౌండేషన్.

డిజిటల్‌ యుగం, టెక్నికల్ గా అభివృద్ధి చెందడంతో ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వారిని వెలికి తెచ్చి ప్రోత్సహాకం అందించేందుకే ఈ ప్రయత్నం అని విజయ్ సేతుపతి తెలిపాడు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1న సినిమాకు సంబంధించిన 23 శాఖలలోని సీనియర్‌ కళాకారులు 100 మందికి పతకాలను అందించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Sethupathi  Gold Gift  Senior Technicians  Ulagayutha Foundation  

Other Articles

Today on Telugu Wishesh