జాతీయ అవార్డుల పంట పండించుకున్న తెలుగు చిత్రాలు Pelli Choopulu wins Best dialogues category in national award 2017

Telugu movies shine at national awards

national awards 2017, national film awards 2017, national awards 2017, national awards this year, national awards winners, telugu movies, national awards for telugu movies, tollywood moviesl national awards full winners list, pelli choopulu, shatamanam bhavathi, janata garage, joker, kollywood, bollywood, akshay kumar

The 64th National Film Awards saw the best of Indian cinema being honoured. This year, the top awards were bagged by Akshay Kumar, who won the Best Actor award,

జాతీయ అవార్డుల పంట పండించుకున్న తెలుగు చిత్రాలు

Posted: 04/07/2017 06:31 PM IST
Telugu movies shine at national awards

64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. పలు విభాగాల్లో తెలుగు చిత్రాలకు అవార్డుల పంట పండించుకున్నాయి. టాలీవుడ్ అగ్రహీరో చిత్రానికి ఒకటి, స్టార్ ప్రోడ్యూసర్ చిత్రానికి ఒకటి అవార్డులు రాగా, ఎలాంటి హీరో, హీరోయిన్లు, స్టార్ డైరెక్టర్, ప్రోడ్యూసర్లు లేకుండానే తెలుగు ప్రేక్షకుల అంచానాలను అమాంతం అందుకుని గుడ్ టాక్ తో క్రమక్రమంగా హిట్ కోట్టిన చిత్రం పెళ్లి చూపులు రెండు అవార్డులను అందుకుంది.

తెలుగు చిత్రాలలో జనతా గ్యారేజ్ సినిమాకు ఉత్తమ నృత్య దర్శకత్వం అవార్డు అందాగా, స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి చిత్రానికి ఉత్తమ ప్రేక్షకాదరణ చిత్రం అవార్డు లభించింది. కాగా దేవరకోండ విజయ్ హీరోగా నటించిన పెళ్లి చూపులు సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు ఉత్తమ మాటల రచయిత అవార్డులను అందుకుంది.

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోలే కాదు మంచి కథ, కథనం వున్న ఏ చిత్రానైనా అదరిస్తారన్న విషయం మరో మారు రుజువు చేసిన చిత్రం పెళ్లి చూపులు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టి నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా దర్శకుడు ఇటీవల ఐఫా అవార్డ్ జరిగిన సందర్భంగా పెళ్లి చూపులు సినిమాను చిన్న చూపు చూశారని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆవేదనలో అర్థం ఉందని పెళ్లి చూపులు సినిమా చాటి చెప్పినట్లయింది.
 
జాతీయ ఉత్తమ నటుడు- అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)
ఉత్త‌మ‌ న‌టి-సుర‌భి ల‌క్ష్మి
ఉత్తమ సామాజిక చిత్రం- పింక్‌
ఉత్తమ సహాయనటుడు- జైరా వసీం
ఉత్తమ హిందీ చిత్రం-నీర్జా
ఉత్తమ తెలుగుచిత్రం-పెళ్లిచూపులు
ఉత్తమ త‌మిళ చిత్రం-జోక‌ర్
ఉత్తమ క‌న్నడ చిత్రం- రిజ‌ర్వేష‌న్
ఉత్తమ సంభాషణలు- తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లి చూపులు)
ఉత్తమ నృత్య దర్శకుడు- రాజు సుందరం (జనతా గ్యారేజ్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు- బాపు పద్మనాభ (కన్నడ)
ఉత్తమ స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌- శివాయ్
ఉత్తమ ఫైట్ మాస్టర్- పీటర్ హెయిన్స్ (పులి మురుగన్)
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్‌- శివాయ్‌
ఉత్తమ స‌హాయ‌న‌టి- జైరా వసీం
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- శతమానం భవతి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : national awards 2017  akshay kumar  pelli choopulu  tollywood  best movies  kollywood  

Other Articles

Today on Telugu Wishesh