కన్ఫ్యూజన్: రాఖీ అరెస్టయ్యిందా? పరారి లో ఉందా? | Cops refuse to confirm Rakhi Sawant's arrest.

Punjab police confirms rakhi sawant not arrested

Rakhi Sawant Arrest, Rakhi Sawant Nor Arrest, Rakhi Sawant Absconding, Rakhi Sawant Surrender, Rakhi Sawant Valmiki, Actress Comments on Valmiki, Valmiki God, Rakhi Sawant Apology Video

Punjab Police deny reports on Rakhi Sawant's arrest for remarks against Valmiki. But her representative says she has 'surrendered'.

రాఖీ సావంత్ పరారీలో ఉందా?

Posted: 04/05/2017 10:11 AM IST
Punjab police confirms rakhi sawant not arrested

సెక్సీ తార రాఖీ సావంత్ అరెస్ట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అసలు ఆమెను అరెస్టే చేయలేని పంజాబ్ పోలీసులు ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. ఆమె పరారీలో ఉందని, ఆచూకీ కోసం తమ బృందాలతో గాలిస్తున్నట్లు లూథియానా పోలీసు కమిషనర్ కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ వెల్లడించాడు. కాగా, రాఖీ అరెస్టైందంటూ నిన్నంతా మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కొట్టిపడేశాడు.

కోర్టు ఆదేశాల మేరకు లూథియానా నుంచి ముంబై వెళ్లిన పోలీసు బృందానికి ఆమె ఆచూకీ దొరకలేదని తెలుస్తోంది. మరోవైపు ఆమె పర్సనల్ సిబ్బంది పరుల్ చావ్లా మాత్రం ఆమె పోలీసుల అదుపులోనే ఉందని చెబుతుంది. పోలీసుల వద్దే ఉన్నట్లు ఆమె వాట్సాప్ లో తనకు సందేశాలు చేసిందని కూడా చూపించింది.

రామాయణం రచయిత వాల్మీకి మహర్షిపై హంతకుడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయటం, వాల్మీకి వర్గానికి చెందిన వారు కేసు నమోదు చేయటం, ఆపై మార్చి 9న న్యాయస్థానానికి హాజరుకావాలని కోర్టు ఆదేశించటం చకచకా జరిగిపోయాయి. అయినప్పటికీ ఆమె గైర్హాజరు కావటంతో ఆగ్రహించిన న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇక తాను తప్పు చేశానని, వాల్మీకి దేవుడంటూ రాఖీ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Rakhi Sawant  Valmiki Controversy  Arrest  

Other Articles