చక్ దే, దంగల్, ఇప్పుడు గురు.. పెద్ద తేడా ఏముంది? | Guru compare with bollywood hit movies. .

Critics on venky performance as guru

Guru Movie, Guru Movie Verdict, Guru Venkatesh Performance, Venky Guru Critics, Guru Dangal, Guru Chak De India Dangal, Venkatesh Sharukh Khan Aamir, Venkatesh Khan Heroes, Dangal Guru Movie

Bollywood film ‘Dangal’ and Telugu film ‘Guru’ are natural to crop up as both the film belong to the same genre and same background. So, audiences who watched Aamir’s ‘Dangal’ will bring in comparisons while watching ‘Guru’.It is healthy to bring good comparisons and he also thinks that his film has its own charm.

గురుతో వెంకీ బాలీవుడ్ ను మరిపించాడు

Posted: 04/01/2017 02:56 PM IST
Critics on venky performance as guru

ఏదైనా ఒక జోనర్ సినిమా వచ్చిందంటే చాలూ పాత సినిమాలను వెతికి మరీ పోలికలు పెట్టేస్తుంటారు కొందరు. శ్రీమంతుడును బాలయ్య జననీ జన్మభూమి లాంటి అట్టర్ ఫ్లాప్ కథతో కంపేర్ చేసిన వాళ్లు లేకపోలేదు. అయితే ఓ రీమేక్ సినిమాను కూడా బాలీవుడ్ లో వచ్చిన చిత్రాలతో పోలుస్తూ ఇప్పుడు కామెంట్లు చేసేయటమే ఇక్కడ అసలు చర్చ. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది వెంకీ గురు గురించి...

స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో బాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు వస్తుంటాయి. చక్ దే దగ్గరి నుంచి మొన్న వచ్చిన దంగల్ దాకా స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాలు బోలెడు వచ్చాయి. తెలుగులో మాత్రం అవి చాలా రేర్ అయినప్పటికీ ఆ ఫీల్ తో కూడిన చిత్రాల లిస్ట్ లో మాత్రం అప్పుడెప్పుడో వచ్చిన అశ్విని మాత్రమే కనిపిస్తుంది. గురు చిత్రం కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. అల్రెడీ మాధవన్ చేసిన ఈ సినిమా సాలా ఖడ్డూస్ రీమేక్ ఇది. రెండేళ్ల క్రితమే రిలీజ్ అయ్యింది కూడా. అయినా ఇప్పుడు దీనిని చక్ దే, దంగల్ లతో పోలుస్తున్నారు కొందరు.

నిజానికి మాతృక కన్నా గురులో వెంకీ చేసిన రోలే బాగా పండిందని పలువురు అభిప్రాయపడ్డారు. కెరీర్ లోనే ది బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడని క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్రెడీ పైన చెప్పుకున్న చిత్రాల్లో షారూఖ్, అమీర్ ల మాదిరిగానే వెంకీ టఫ్ కోచ్ రోల్ లో కనిపించాడు. ముఖ్యంగా అమ్మాయిలతో రూడ్ గా బిహేవ్ చేసే రోల్ లో జీవించేశాడు. దీంతో సాధారణంగానే పోలిక రావటం సహజం.

కానీ, తన స్టార్ డమ్ ను, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోని వెంకీ ఓ ఛాలెంజింగ్ పాత్ర పండాలనే ఉద్దేశ్యంతోనే నటించాడు. సీనియర్ హీరోల్లో మిగతా వాళ్లు(ఒక్క నాగ్ తప్ప) ఫిజికల్ ఫిట్ నెస్ పై దృష్టిసారించనప్పటికీ, తాను మాత్రం ఆ విషయంలో ఓ మెట్టు ఎక్కేశాడు. ఒక రకంగా వెంకీ చేసిన ప్రయోగానికి ఆ కంపేరిజన్ కూడా చాలా మంచిదనే పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guru Movie  Venkatesh Performance  Critics Comments  

Other Articles