ప్రభుదేవా కొత్త సినిమా షూటింగ్ లో ప్రమాదం... ఇద్దరు ఎలా చనిపోయారంటే... | Prabhu Deva film crew members died.

Mishap in prabhudeva new movie shooting

Yung Mung Sung Mishap, Yung Mung Sung Accident, Yung Mung Sung Shooting, Yung Mung Sung Accident, Kumbakonam Prabhu Deva, Prabhu Deva New Movie, Movie Crew Members Death, Kollywood 2017 Mishap, Kollywood News

Two persons, including a member of a Prabhu Deva film Yung Mung Sung crew, were killed and five others seriously injured when the van in which they were travelling dashed against a lorry near Kumbakonam in the district, police said. Crew had been participate in for the shooting in Kumbakonam and surrounding areas for the past 15 days.

తమిళ షూటింగ్ లో ప్రమాదం.. ఇద్దరు మృతి

Posted: 04/01/2017 01:22 PM IST
Mishap in prabhudeva new movie shooting

ప్రముఖ డాన్సర్, హీరో ప్రభుదేవా కొత్త సినిమాకు సంబంధించి ఇద్దరు మరణించిన ఘటన తమిళనాడులో జరిగింది. శుక్రవారం రాత్రి షూటింగ్ క్రూ తో కలిసి వెళ్తున్న వ్యాన్ ను ఓ లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

యంగ్ మంగ్ సంగ్ చిత్ర షూటింగ్ గత రాత్రి తిరువైయార్ గుళ్లో జరిగింది. వారి కోసం భోజనం తీసుకొచ్చేందుకు బయలుదేరిన వ్యాన్ కారుప్పూర్ గ్రామ సమీపంలో ఓ లారీని ఢీకొట్టింది. వ్యాన్ డ్రైవర్ తోపాటు చిత్ర యూనిట్ లోని ఓ సభ్యుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం వారికి కుంభకోణం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

కాగా, గత 15 రోజులుగా కుంభకోణం పరిసర ప్రాంతాల్లో 'యంగ్ మంగ్ సంగ్' షూటింగ్ నడుస్తోంది. అభినేత్రి తర్వాత మళ్లీ ప్రభుదేశా సోలో హీరోగా చేస్తున్న చిత్రమిదే. దీనిని తెలుగులో డబ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కేథరిన్ థ్రెస్సా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కుంగ్ ఫూ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhu Deva  Yung Mung Sung Movie  Crew Death  

Other Articles

Today on Telugu Wishesh