రూమర్లు.. నో కామెంట్స్.. రజనీకే క్లారిటీ లేదా? | Rajinikanth fans meet just casual.

Rajinikanth open up on political speculations

Rajinikanth, Rajinikanth Political Entry, Rajinikanth Fans Meet, Rajinikanth Clarified, Rajinikanth open up, Rajinikanth Fans Meet

Rajinikanth finally open up on political entry. No political plans. Meeting fans was long overdue. I'm just going to meet them and discuss on how to manage things."

రూమర్లపై రజనీ ఓపెన్ అయ్యాడు

Posted: 03/31/2017 03:30 PM IST
Rajinikanth open up on political speculations

రాజకీయాల్లో రజనీ హవా మొదలవుతుందని అభిమానులు ఆనందిస్తున్న వేళ చల్లగా నీళ్లు జల్లాడు సూపర్ స్టార్. త్వరలో అభిమాన సంఘాలతో భేటీ అయి పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చించబోతున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నేరుగా స్పందించాడు. అదంతా ఉత్తదేనని తెలిపాడు.

ఏప్రిల్ 2న పెద్ద ఎత్తున్న అభిమానులతో సమావేశం అవుతున్న మాట వాస్తవమే. అనారోగ్య కారణాలతో వాళ్లను కలిసి చాలా రోజులయ్యింది. అందుకే ఈ భేటీ తప్ప రాజకీయ చర్చ కోసం కాదని వివరించాడు. ప్రస్తుతం తనుకు రాజకీయ ఆలోచనలు లేవన్న రజనీ కేవలం అభిమాన సంఘాల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు కలవబోతున్నానని తెలిపాడు. ఇక మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ను కలవటం పై స్పందిస్తూ కబాలి
సమయంలో మలేషియన్ ప్రభుత్వం అందించిన సహకారం పై కృతజ్నతలు తెలిపేందుకేనన్నాడు.

షూటింగ్ సమయంలో ఆయన్ను కలవటం వీలు కాలేదు. ఇప్పుడు చెన్నైలో ఉన్నారని తెలిసి కలిసేందుకు యత్నించా. అపాయింట్ మెంట్ దొరికింది. చాలా సంతోషం అని వివరించాడు. ఇక మలేషియాకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై అదంతా రూమర్లేనని తేల్చేశాడు. ఇక సొంత పార్టీ, ఇతరులకు మధ్ధతుపై అడిగిన కొన్ని ప్రశ్నలకు నో కామెంట్స్ అనే సమాధానం వినిపించింది. ఏది
ఏమైనా తన మైండ్ లో ఇప్పుడప్పుడే రాజకీయాల ప్రసక్తే లేదని చెబుతూ మరో కన్ఫ్యూజన్ కు తెరలేపాడు తలైవా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Political Entry  Fans Meet  

Other Articles