కాటమరాయుడు ప్రీ రిలీజ్ లెక్క తేలింది.. పవన్ రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే | Pawan remuneration for Katamarayudu.

Katamarayudu the biggest after baahubali

Pawan kalyan, Katamarayudu Pre Release Business, Katamarayudu Makers Profits, Katamarayudu Pawan Remuneration, Pawan Kalyan Remuneration, Katamarayudu Business, Katamarayudu Rights Sold

Pawan Kalyan's Katamarayudu Pre Release business total 115 crores.

కాటమరాయుడు కళ్లు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్

Posted: 03/21/2017 04:42 PM IST
Katamarayudu the biggest after baahubali

ఒక తమిళ సినిమా తెలుగులోకి డబ్ అయ్యింది. అరిగిపోయిన రికార్డులాగా వారానికి రెండు, మూడు సార్లు టీవీలో టెలికాస్ట్ అవుతూనే ఉంది. అయినా ఆ సినిమాకు రీమేక్ చేసి వదలబోతున్నారు. ఇదంతా కాటమరాయడు గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, పవర్ స్టార్ క్రేజ్ ముందు ఆ విమర్శలేం పని చేయటం లేదు.

అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఓ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను కాటమరాయుడి రూపంలో అందించబోతున్నాడు పవన్. సినిమాకు వచ్చిన క్లీన్ యూ సర్టిఫికెట్ దీనికే నిదర్శనం. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ బ్యానర్ నార్త్ స్టార్ ఎంటర్ టైనర్ సుమారు 30 కోట్లు(ఒక్క పవన్ రెమ్యునరేషన్ తప్ప అన్ని హక్కులు కలుపుకుని) వెచ్చించి సినిమాకు నిర్మించింది.

ఇప్పటిదాకా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, ఆడియో వీడియో అన్ని కలిపి కాటమరాయుడు 115 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే బడ్జెట్ కు నాలుగు రెట్ల బిజినెస్ చేసిందన్న మాట. ఆ లెక్కన్న 85 కోట్ల లాభం నిర్మాతలకు అల్రెడీ వచ్చేసింది. తెలుగులో ఒక్క బాహుబలిని మినహాయిస్తే మరెయిత తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ లాభాలను మేకర్లకు అందించలేదు. దీనిలో పవన్ వాటా 60 శాతం దాకా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఆ లెక్కన ఫ్రాఫిట్ లో పవన్ రెమ్యునరేషన్ 50 కోట్లన్నమాట. ఇక పవన్ ముందుంది తన స్టామినాతో కలెక్షన్లను కొల్లగొట్టడమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu  Pre Release Business  Remuneration  

Other Articles