కాటమరాయుడు రిలీజ్.. ఇంతకీ పవన్, ప్రమోషన్లు ఎక్కడా? | Pawan not interested Katamarayudu promotions.

Pawan kalyan no promotions for katamarayudu

Pawan kalyan, Katamarayudu, Pawan Katamarayudu, Katamarayudu Promotions, Katamarayudu Weak Promotions, Katamarayudu Makers, Katamarayudu Pawan Kalyan Interview

Katamarayudu makers no promotion stunts for movie. Even Pawan kalyan also not giving any interviews till now.

కాటమరాయుడు ప్రమోషన్లు.. పవన్ ఎక్కడ?

Posted: 03/21/2017 03:19 PM IST
Pawan kalyan no promotions for katamarayudu

పవర్ స్టార్ కాటమరాయుడిగా థియేటర్లలో సందడి చేసేందుకు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. కేవలం పవన్ క్రేజ్ మూలంగానే వీకెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అన్ని బుక్ అయిపోయాయి. అయితే టీజర్ తర్వాత సినిమాపై నెలకొన్న హైప్ చూసి భీభత్సమైన ప్రమోషన్స్ జరుగుతాయని అంతా భావించారు. కానీ, అక్కడే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ఇప్పటికే ప్రీ రిలీజ్ పంక్షన్ పేరిట ఓ తంతు ముగించేసిన నిర్మాత శరత్ మరార్ తర్వాత స్టెప్పేలేవీ తీసుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఏ భాషలోనైనా ఎంతటి పెద్ద స్టార్ మూవీ అయిన సరే ప్రమోషన్ల కంపల్సరీ. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్, వీళ్లే కాదు తర్వాతి జనరేషన్ హీరోలు కూడా ఈ విషయంలో కేర్ తీసుకుని యాక్టివ్ గా ఉంటుంటారు. అఫ్ కోర్స్ పవన్ కూడా ఈ విషయంలో తక్కువేం కాదు. తన గత చిత్రాల కోసం ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు హడావుడి బాగానే చేశాడు.

అయితే ఓవైపు బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా కొత్త కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతూ ట్రెండింగ్ అయిపోన్న క్రమంలో, కాటమరాయడు విషయంలో పవన్ సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమా టాక్ సంగతి పెట్టి, వీకెండ్ బాక్సాఫీస్ కొల్లగొట్టలంటే మినిమమ్ ప్రమోషన్లు అవసరం. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక మంచి టాక్ వచ్చినా కూడా లాభం లేకుండా పోతుంది. గతంలో చాలా చిత్రాలు ఇలానే నష్టపోయాయి కూడా. అందుకే పవన్ ఇప్పటికైనా స్పందించి వేగం పెంచుతాడేమో చూడాలి మరి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu  Promotions  

Other Articles